Pushpa2 : పుష్ప‌2 రిలీజ్ కాకముందే పుష్ప‌3 టైటిల్ లీక్.. అదేంటో తెలిస్తే స్ట‌న్ అవుతారు.!

Pushpa2 : పుష్ప‌2 రిలీజ్ కాకముందే పుష్ప‌3 టైటిల్ లీక్.. అదేంటో తెలిస్తే స్ట‌న్ అవుతారు.!

Pushpa2 : అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెర‌కెక్కిన సూప‌ర్ హిట్ మూవీ పుష్ప‌. ఈ చిత్రం అతి పెద్ద విజ‌యం సాధించ‌డంతో పుష్ప‌2 చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ మూవీ డిసెంబ‌ర్ 5న విడుద‌ల కానుంది. మూవీ కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. విడుదలకు ముందే రికార్డులను తిరగరాయడం మొదలు పెట్టిన పుష్ప2, థియేటర్లలోకి వచ్చాక ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందోనని అటు ఫ్యాన్స్‌తోపాటు సినీ క్రిటిక్స్‌ సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించి జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. దీంతో మూవీపై అంచ‌నాలు భారీగా పెరిగాయి.

ఇక ఇప్పటికే ఓవర్‌సీస్‌తో పాటు, ఇండియాలో అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులను తిరగరాసింది పుష్ప2. కాగా పుష్ప2 విడుదలకు ముందే పుష్ప3 చిత్రానికి సంబంధించి వార్తలు వస్తున్నాయి. కచ్చితంగా పుష్ప ఫ్రాంచైజీ నుంచి మరో సినిమా ఉండనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. బెర్లిన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అల్లు అర్జున్‌ స్పందిస్తూ.. పుష్ప ‘పార్ట్‌3’ ఉంటుందని తెలిపారు. ‘పుష్ప2’ క్లైమాక్స్‌లో ‘పార్ట్‌-3’కి లీడ్‌ ఇస్తూ కొన్ని సన్నివేశాలను చూపించనున్నట్టు అయితే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ నేప‌థ్యంలో పుష్ప మూడో పార్ట్ మీద సుకుమార్ మాట్లాడుతూ సోమవారం నాటి ఈవెంట్‌లో ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు. అల్లు అర్జున్ ఇంకో మూడేళ్లు టైం ఇస్తే, డేట్లు ఇస్తే కచ్చితంగా మూడో పార్ట్ తీస్తానని నవ్వుతూ అన్నాడు. అయితే మూడో పార్టుకి పుష్ప ది ర్యాంపేజ్ అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారని తెలుస్తోంది.

ఈ మేరకు ఓ ఫోటో నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతోంది. మూడో పార్ట్ టైటిల్ ఇదే అంటూ పుష్ప ది ర్యాంపేజ్ గురించి నెట్టింట్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సౌండ్‌ ఇంజినీర్‌గా ఆస్కార్‌ అవార్డు విజేత రసూల్‌ పూకుట్టి పనిచేశారు. ఆయన తన టీమ్‌తో కలిసి దిగిన ఫొటో వెనుక ‘పుష్ప3’ టైటిల్‌ ఉంది. అందులో ‘పుష్ప3: ది ర్యాంపేజ్‌’ అని ఉంది. దీంతో పుష్ప2లో కచ్చితంగా పార్ట్‌కి సంబంధించిన హింట్‌ ఉండబోతోందని స్పష్టమవుతోంది.దీనిపై పూర్తి క్లారిటీ పుష్ప‌2 రిలీజ్ త‌ర్వాత తెలుస్తుంద‌ని అంటున్నారు.