Rajendra Prasad : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పుష్ప2 ప్రభంజనం సృష్టిస్తుంది. కలెక్షన్స్ విషయంలో ఈ మూవీ దూసుకుపోతుంది. బాలీవుడ్ ప్రముఖులు ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కూడా బన్నీ నటనని ఆకాశానికి ఎత్తేశారు. అయితే అంతటా పుష్పరాజ్‌కి ప్రశంసలు దక్కుతున్నా టాలీవుడ్ నుండి కరువయ్యాయి. ప్రశంసల సంగతి ఏమో కాని విమర్శలు కూడా చేయడం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా రాజేంద్ర ప్రసాద్ ఓ ఈవెంట్‌లో పుష్ప2 గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
రాజేంద్ర ప్రసాద్ `హరికథ` అనే సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. మ్యాగీ దీనికి దర్శకత్వం వహించారు. రాజేంద్రప్రసాద్‌తో పాటు శ్రీరామ్, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి, రుచిర సాధినేని తదితరులు కీలక పాత్రల్లో నటించారు.. ఈ సిరీస్ 13 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ .. ఇప్పుడు సినిమాల కథలు పూర్తిగా మారిపోయాయి.. వాడెవడో చందనం దొంగ వాడు హీరో అంటూ నోరు జారాడు రాజేంద్రప్రసాద్. తనపై తాను కూడా విమర్శలు చేసుకున్నారు. హీరోల్లో మీనింగ్‌లు మారిపోయాయని అన్నారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
సినిమాల గురించి తెలిసి ఇలా అనడం ముమ్మాటికీ తప్పు అంటూ సినీ అభిమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే బన్నీకి, రాజేంద్ర ప్రసాద్‌కి మంచి సాన్నిహిత్యం ఉంది. రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి హఠాన్మరణం చెందిన సమయంలో కూడా బన్నీ వారి ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు. రాజేంద్ర ప్రసాద్‌కి ధైర్యం చెప్పారు. గాయత్రి హఠాన్మరణం తనను షాకింగ్‌కు గురిచేసిందని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. బన్నీతో ఎంతో సాన్నిహిత్యంగా ఉండే రాజేంద్ర ప్రసాద్ ఎందుకు ఇలా సడెన్‌గా కామెంట్స్ చేశాడా అని అందరు ముచ్చటించుకుంటున్నారు. కాగా, రాజేంద్ర ప్రసాద్‌కి హీరోగా, సహాయ నటుడుగా వందల సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులు అభిమానాన్ని పొందారు. ఈయన చేసే ప్రతి పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అందుకే ఆయనకు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది .