Rajendra Prasad : ఒకప్పుడు కామెడీ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్‌లో నటిస్తూ అలరిస్తున్నారు. విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజేంద్రప్రసాద్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు తెలియజేసారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..” సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు మా నాన్న అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో ఫెయిల్ అయితే ఇంటికి రావద్దు అన్నారు. ఒక దశలో వేషాలు రాకపోవడంతో.. చేతిలో డబ్బులు లేక అవకాశాలు లేక మూడు నెలలు అన్నం తినలేదు. ఇక నాన్న కూడా ఇంటికి రావద్దు అన్నారు కదా అని ఆలోచించిన నేను, చివరికి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కానీ చివరిగా నిర్మాత పుండరీ కాక్షయ్య ఆఫీస్ కి వెళ్తే , అక్కడ డబ్బింగ్ అవకాశం వచ్చింది. దానితో నా దశ కూడా తిరిగిపోయింది” అంటూ తెలిపారు రాజేంద్రప్రసాద్.
రామారావు గారి స్పూర్తితో ఇండస్ట్రీలోకి వచ్చాను అన్నారు. అలాగే సినిమాల్లోకి రావడం తన తండ్రికి ఇష్టం లేదని.. సినిమాల్లో ఫెయిల్ అయితే తిరిగి ఇంటికి రావొద్దు అని అన్నారని తెలిపారు. ఎలాగైనా సినిమాల్లో సక్సెస్ అవ్వాలని అనుకున్నా..అయితే సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు మా నాన్న అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో ఫెయిల్ అయితే ఇంటికి రావద్దు అన్నారు. ఒక దశలో వేషాలు రాకపోవడంతో.. చేతిలో డబ్బులు లేక అవకాశాలు లేక మూడు నెలలు అన్నం తినలేదు. ఇంటికి నాన్న రానివ్వరు. చేతిలో డబ్బులు లేవు. అవకాశాలు రావడం లేదు. అప్పటికే భోజనం చేసి మూడు నెలలు అవుతుంది. చేతిలో ఉన్న చిల్లరతో రోజుకు ఒక్క అరటి పండు, ఒక గ్లాస్ మజ్జిగ మాత్రమే తాగుతూ జీవించా.. చివరకు అవి కూడా అయిపోయాయి. ఇక మరణమే శరణం అనుకున్నా.. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా.. చివరిగా నా గురు సమానులు అయిన అందరిని ఒక్కసారి కలుద్దాం అని వెళ్ళాను.
ముందుగా రామారావుగారి ఇంటికి వెళ్ళాను. ఆయన ఎదో బిజీలో ఉన్నారు. అలా తిరిగి తిరిగి చివరకు పుండరీకాక్ష్యయ్య గారి దగ్గరకు వెళ్ళాను. అప్పటికే అక్కడ ఎదో పెద్ద గొడవ అవుతుంది. నన్ను చూసిన ఆయన ఎప్పుడు వచ్చావ్ అంటూ నన్ను పలకరించారు. ఆతర్వాత నన్ను తీసుకొని వెళ్లి మేలుకొలుపు అనే సినిమాకు డబ్బింగ్ చెప్పించారు. ఆ సినిమాలో నటించిన వ్యక్తి తమిళనాడుకు చెందిన వాడు కావడంతో నాతో డబ్బింగ్ చెప్పించారు. నేను నాలుగు డైలాగ్స్ చెప్పాను. ఆతర్వాత నేను భోజనం చేసి మూడు నెలలు అయ్యింది. ఆకలి వేస్తుంది. ఏదైనా తిని చెప్పాను అన్నాను.. అంటూ ఎమోషనల్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్.