Ram Charan : ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన రామ్ చరణ్ వచ్చే ఏడాది గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న బుచ్చిబాబుతో సినిమా చేయనున్నాడు. ఆర్సీ 16 పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ మైసూర్లో జరుపుకుంటుంది. ఈ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు చెర్రీ. ఈ మూవీలో చరణ్ కొత్త లుక్‌లో కనిపించనున్నారు.ఉత్తరాంధ్రలోని విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోంది, ఇందులో చరణ్ రగ్గడ్ గడ్డంతో ఊరమాస్‌గా దర్శనమిచ్చే అవకాశం ఉంది.ఈ లుక్‌ను ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ డిజైన్ చేశారు. ఇంకా ఈ ప్రీ లుక్‌తో చరణ్ మాస్ పర్సనాలిటీని చూపించనున్నాడు.
చరణ్, అకీమ్ హకీమ్‌తో దిగిన ఫోటోను దర్శకుడు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చరణ్ లుక్ అదిరిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మూవీ విషయానికి వస్తే మైసూర్లో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక సెట్లో షూటింగ్ జరుగుతోంది. తొలి షెడ్యూల్లో కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా .. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ మూవీ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మంచి హిట్ అయ్యేలా కనిపిస్తుంది. కన్నడ నటుడు శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. త్వరలోనే ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత చరణ్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో రంగస్థలం సినిమా చేసిన విషయం తెలిసిందే. రంగస్థలం సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు రంగస్థలం సినిమా తర్వాత మరోసారి సుకుమార్, చరణ్ కలిసి సినిమా చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటించనుందని అంటున్నారు.