Ram Charan-Sobhita : రామ్ చ‌ర‌ణ్‌, శోభిత‌ల పెళ్లి వీడియో నెట్టింట వైర‌ల్‌…ఫొటోలు చూసి అంద‌రు నోరెళ్ల‌పెడుతున్నారుగా..!

Ram Charan-Sobhita : రామ్ చ‌ర‌ణ్‌, శోభిత‌ల పెళ్లి వీడియో నెట్టింట వైర‌ల్‌…ఫొటోలు చూసి అంద‌రు నోరెళ్ల‌పెడుతున్నారుగా..!

Ram Charan-Sobhita : అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల మరికొద్ది గంటల్లో పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్న విష‌యం తెలిసిందే. ఈ వివాహ వేడుకకు సంబంధించిన పనులు అన్ని పూర్తి అయిపోయాయి. డిసెంబరు 4న అన్నపూర్ణ స్టూడియోస్‌ వేదికగా రాత్రి 8 గంట‌ల 13 నిమిషాల‌కి వీరి పెళ్లి వేడుక జరగనుంది. అయితే ఈ పెళ్లి వేడుకను సింపుల్​గా అతి తక్కువ మందితో జరపనున్నట్లు రీసెంట్​గా వార్తలు వచ్చాయి. ఈ వివాహ వేడుక‌కి సినీ, రాజకీయ రంగానికి సంబంధించిన పలువురు ప్రముఖులు హాజరు కానున్నారట. ‘పుష్ప 2’తో ఆడియెన్స్​ను అలరించడానికి సిద్ధమైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, తన ఫ్యామిలీతో కలిసి ఈ వేడుకకు రానున్నట్లు తెలిసింది. ఇంకా రెబల్ స్టార్ ప్రభాస్‌, దిగ్గజ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి సహా సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు పెళ్లిలో సంద‌డి చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

ఇక నాగ చైత‌న్య‌, శోభిత‌ల పెళ్లి పెళ్లి వేడుక పూర్తి హిందూ సంప్రదాయ పద్ధతిలోనే జరగనుంది. దాదాపు ఏడెనిమిది గంటల పాటు ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన అన్ని క్రతువులు ఒకదాని తర్వాత ఒకటి నిర్వహిస్తారట. ప్ర‌స్తుతం అంద‌రు కూడా వీరి పెళ్లికి సంబంధించి ముచ్చ‌టించుకుంటున్న స‌మ‌యంలో స‌డెన్‌గా రామ్ చ‌ర‌ణ్‌, శోభిత పెళ్లి వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇది చూసి అంద‌రు షాక్ అవుతున్నారు. అయితే వారిద్ద‌రు రియ‌ల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్‌లో వివాహం చేసుకున్నారు. రామ్ చరణ్, శోభితా కలిసి నటించిన యాడ్‌లో ఇద్దరూ భార్యభర్తలుగా కనిపించారు. దీంతో ఒక్కసారిగా వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి ప్రేక్షకుల్లో చర్చ మొదలయ్యింది. 1 నిమిషంలోనే ఈ పెయిర్ చూడడానికి ఇంత బాగుంటే.. ఒకవేళ ఒక సినిమాలో కలిసి నటిస్తే.. ఇంకెంత బాగుంటుందో అని ఊహించుకోవడం మొదలుపెట్టారు ఫ్యాన్స్.

ఒక క్లాత్ బ్రాండ్ కోసం రామ్ చరణ్, శోభితా కలిసి యాడ్‌లో నటించారు. ఇందులో పెళ్లికూతురు గెటప్‌లో శోభితా ఎదురుచూస్తూ ఉండగా.. పెళ్లికొడుకు గెటప్‌లో రామ్ చరణ్ మండపానికి ఆలస్యంగా వస్తాడు. దీంతో శోభితా అలక చూపిస్తుంది. దానికి రామ్ చరణ్ క్యూట్‌గా బ్రతిమిలాడుకుంటాడు. ఇదంతా చూసి.. ప్రేక్షకులు ఈ యాడ్‌కు ఫిదా అయ్యారు. అప్ప‌ట్లో వీరిద్ద‌రు క‌లిసి సినిమాల‌లో న‌టిస్తే చాలా బాగుంటుంద‌ని అని అనుకున్నారు.