Ranbir Kapoor : యానిమ‌ల్ 3 మ‌రింత అరాచ‌కంగా ఉంటుందంటూ ర‌ణ్‌బీర్ క‌పూర్ క్లారిటీ..!

Ranbir Kapoor : యానిమ‌ల్ 3 మ‌రింత అరాచ‌కంగా ఉంటుందంటూ ర‌ణ్‌బీర్ క‌పూర్ క్లారిటీ..!

Ranbir Kapoor : అర్జున్ రెడ్డి చిత్రంతో అరాచకం సృష్టించిన డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా. ఆయన బాలీవుడ్‌లో యానిమ‌ల్ అనే చిత్రాన్ని తెర‌కెక్కించిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ కావ‌డంతో ప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీసే పని జరుగుతోంది. యానిమల్ పార్క్ అని ఇది వరకే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. అయితే రణబీర్ కపూర్ ‘యానిమల్ 3’ కూడా సినిమా రాబోతుందని చెప్పాడు. ఇది విన్న అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఎప్పుడు ప్రారంభమవుతుందనే సమాచారం మాత్రం చెప్పలేదు చాక్లెట్ బాయ్.

అర్జున్‌ రెడ్డి, కబీర్‌ సింగ్‌, యానిమల్ సినిమాలతో బాక్సాఫీస్‌ రికార్డ్‌ బద్దలు కొట్టిన సందీప్‌ రెడ్డి వంగా బీటౌన్ యాక్టర్ రణ్‌బీర్‌ కపూర్ తో యానిమల్‌ సీక్వెల్ గా యానిమల్ పార్క్ చేయ‌బోతుండ‌గా, ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.సీక్వెల్ 2027లో ప్రారంభమవుతుందని వెల్లడించిన రణ్‌బీర్ కపూర్, తర్వాత ‘యానిమల్ 3’ ప్రొడక్షన్ పనులను త్వరగా ప్రారంభించే దిశగా దృష్టి సారించనున్నానని తెలిపాడు.
‘యానిమల్’ విజయం సాధించిన తరువాత, మూడో భాగం చేయాలనే ఆలోచన మొదటి నుండి ఉందని, ఇప్పుడు అది ఒక ధృడమైన నిర్ణయంగా మారిందని రణ్‌బీర్ కపూర్ పేర్కొన్నాడు.

ఫస్ట్ పార్ట్ షూట్ చేస్తున్నప్పుడు దీని గురించి చర్చించుకున్నాం. ఈ కథను కొనసాగించాలనుకుంటున్నాం. ఈ సినిమా నాకెంతో సంతోషాన్నిచ్చింది ఈ సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’ అని రణబీర్ కపూర్ చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమా పార్ట్ 3 కు యానిమల్ కింగ్ డమ్ అనే టైటిల్ బాగుంటుందన్నారు సినీ ఫ్యాన్స్. సందీప్‌ రెడ్డి వంగాను ఒరిజినల్ డైరెక్టర్‌గా సంబోధించే రణ్‌బీర్‌.. ఈ క్రేజీ డైరెక్టర్‌తో ప్రాంఛైజీ సినిమాలు చేయడంపై ఎక్జయిటింగ్‌గా ఉన్నాడు.యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగ ..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో ఓ సినిమా చెయ్యనున్నారు. ఈ సినిమాలు పూర్తయ్యాక యానిమల్ వైపు వెళ్తాడు..