Rashmika : ర‌ష్మిక చేతికి ఆ క‌ట్టు ఏంది.. ఆందోళ‌న చెందుతున్న నేష‌న‌ల్ క్రష్ ఫ్యాన్స్

Rashmika : ర‌ష్మిక చేతికి ఆ క‌ట్టు ఏంది.. ఆందోళ‌న చెందుతున్న నేష‌న‌ల్ క్రష్ ఫ్యాన్స్

Rashmika : నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంధాన గ‌త కొద్ది రోజులుగా పుష్ప‌2 ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉంది. రీసెంట్‌గా అల్లు అర్జున్‌తో క‌లిసి కేర‌ళ వెళ్లింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లిన‌ రష్మిక, అల్లు అర్జున్ లకి కేరళలో ఘనస్వాగతం లభించింది. అయితే విమానంలో సరదాగా మాట్లాడుకుంటున్న రష్మిక అల్లు అర్జున్ ల ఫోటో ఒకటి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది..ఫొటోలో ఇద్ద‌రు చాలా స‌ర‌దాగా క‌నిపించారు. కాక‌పోతే రష్మిక చేతికి బ్యాండేజ్ ఉండటంతో ఆ చేతికి ఏమైందో అని కలవర పడుతున్నారు ఆమె ఫ్యాన్స్. అయితే చేయి బెణకటం, చెయ్యి నొప్పి వంటి చిన్న వాటికే అలాంటి బ్యాండేజ్ వాడతారని కాబట్టి కంగారుపడవలసిన అవసరం లేదని కొందరు నెటిజ‌న్స్ అంటున్నారు.

కొన్నాళ్లుగా ర‌ష్మిక‌కి పెద్ద హిట్ ప‌డ‌డం లేదు. దాంతో పుష్ప‌2పై భారీ అంచ‌నాలు పెట్టుకుంది. ఈ సినిమా స‌క్సెస్ అయితే ర‌ష్మిక‌కి మ‌ళ్లీ ఆఫ‌ర్ల వెల్లువ కుర‌వ‌డం ఖాయం. పుష్ప 2 సినిమాని ఆరు భాషల్లో విడుదల చేయగా ప్రతి భాషలో కూడా మలయాళం వెర్షనే ఉంటుంది, అది బన్నీ మలయాళ అభిమానులకు ఇస్తున్న కానుక అని చెప్తున్నారు. ఫీలింగ్స్ పేరుతో సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాట మాస్ కి బాగా ఎక్కుతుందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా యొక్క సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకి సెన్సార్ బోర్డు యూ/ ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. మూడు గంట‌ల 20 నిమిషాల పాటు సినిమా ర‌న్ టైం అని తెలుస్తుండ‌గా, ఇది ప్రేక్ష‌కులకి రెండున్న‌ర గంట‌ల మాదిరిగానే ఉంటుంద‌ని అంటున్నారు.

ఇక ఇదిలా ఉంటే : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, రౌడీ హీరో విజయ్ దేవరకొండ రిలేషన్‌షిప్ గురించి ఓపెన్‌గా అందరికి తెలిసిన సీక్రెట్. తాము డేటింగ్‌లో ఉన్నట్లు బయటకు చెప్పకపోయిన ఎన్నోసార్లు ఇద్దరు కలిసి కెమెరాలకు చిక్కారు. ఇద్దరు ఒకే ప్లేస్‌లో ఉండి విడి విడిగా దిగిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్ట‌డంతో వాటిని బాగా గమనించిన నెటిజన్స్ ఇద్దరూ ఒక్కచోట ఒక్కసారి దిగినట్లు చాలా సందర్భాల్లో తేల్చారు. ఇక ఇటీవల ఓ ఈవెంట్‌లో తాను సింగిల్‌గా ఉన్నాను అంటే నమ్ముతారా అని ఇన్‌డైరెక్ట్‌గా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు విజయ్ దేవరకొండ హింట్ ఇచ్చాడు. చూస్తుంటే త్వ‌ర‌లో ర‌ష్మిక విజయ్ దేవ‌ర‌కొండ ఏడ‌డుగులు వేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.