Vijay-Rashmika : విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యామిలీతో థియేట‌ర్‌లో మెరిసిన ర‌ష్మిక‌.. ఏం జ‌రుగుతుంది..!

Vijay-Rashmika : విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యామిలీతో థియేట‌ర్‌లో మెరిసిన ర‌ష్మిక‌.. ఏం జ‌రుగుతుంది..!

Vijay-Rashmika : టాలీవుడ్‌లో కొన్ని జంట‌లు సీక్రెట్ ప్రేమాయ‌ణం కొన‌సాగిస్తున్నాయి. అనేక పుకార్లు వ‌చ్చిన కూడా వారు స్పందించక‌పోయేస‌రికి ఏం జ‌రుగుతుంది వారి మ‌ధ్య అనే అనుమానాలు త‌లెత్తుతున్నాయి. నాగ చైత‌న్య-శోభిత‌ల మ‌ధ్య ఏదో న‌డుస్తుంద‌ని ప్ర‌చారాలు సాగిన వారు ఖండించలేదు. చివ‌రికి పెళ్లి బంధంతో ఒక్క‌టయ్యారు. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌-ర‌ష్మిక కూడా పెళ్లి చేసుకొని షాక్ ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తుంది. గీత గోవిందం నుంచే విజయ్ -రష్మిక ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. మొదట్లో ఈ జంట తామిద్దరం కేవలం మంచి స్నేహితులమే అని చెప్పుకొచ్చిన త‌ర్వాత వారి వ్య‌వ‌హారం కాస్త తేడాగా క‌నిపించింది.

క‌లిసి వెకేషన్స్ కు వెళ్లడం.. రెస్టారెంట్స్ కు వెళ్లడం కెమెరాల‌లో చిక్కాయి. మరీ ముఖ్యంగా రష్మిక తన ప్రతి పండగను విజయ్ ఇంట్లోనే జరుపుకుంటుంది.ఈ మధ్య రష్మిక మందన్న విజయ్ దేవరకొండ కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతుంది. ఇటీవల దీపావళి పండుగను విజయ్ దేవరకొండ ఇంట్లో జరుపుకుంది రష్మిక. ఇప్పుడు రష్మిక ‘పుష్ప 2’ని విజయ్ దేవరకొండ కుటుంబానికి చూపించ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది..హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో రష్మిక చిత్రాన్ని వీక్షించింది. విజయ్ దేవరకొండ తల్లి మాధవి, విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ తో కలిసి రష్మికతో పుష్ప 2 సినిమా చూసింది. అయితే వారితో విజయ్ దేవరకొండ లేడు కాని విజ‌య్ కి సంబంధించిన రౌడీ టీ ష‌ర్ట్ ధ‌రించింది ర‌ష్మిక‌.

అంతకు ముందు అల్లు అర్జున్ తో కలిసి పుష్ప 2 ప్రీమియర్స్ చూసింది రష్మిక. ఇప్పుడు విజయ్ ఫ్యామిలీతో కలిసి మరోసారి సినిమా చూసింది. ఇక పుష్ప 2 సినిమాతో రష్మిక క్రేజ్ డబుల్ అయ్యింది. ఇప్పుడు ఈ అమ్మడి చేతిలో అరడజను కు పైగా సినిమాలు ఉన్నాయి. ఏది ఏమైన ర‌ష్మిక హంగామా ఇప్పుడు మాములుగా లేద‌ని చెప్పాలి. ఒక‌వైపు త‌నకి కాబోయ్ భ‌ర్త ఫ్యామిలీతో స‌ర‌దాగా గడుపుతూ, మ‌రోవైపు విజ‌య్ బ్రాండ్ కు కూడా ప్రమోషన్స్ చేస్తున్నావ్ అన్నమాట అంటూ ఫ్యాన్స్ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ జంట త్వరలోనే పెళ్లి గురించి అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.