నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. RCFLలో ఖాళీలు.. పూర్తి వివ‌రాలు ఇవే..!

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. RCFLలో ఖాళీలు.. పూర్తి వివ‌రాలు ఇవే..!

భార‌త ప్ర‌భుత్వ రంగానికి చెందిన ముంబైలోని రాష్ట్రీయ కెమిక‌ల్స్ అండ్ ఫెర్టిలైజ‌ర్స్ లిమిటెడ్ (RCFL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ నియామ‌క ప్ర‌క్రియ‌లో భాగంగా అప్రెంటిస్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. మొత్తం 378 అప్రెంటిస్ పోస్టుల‌ను ప‌లు విభాగాల్లో భ‌ర్తీ చేస్తారు. అసిస్టెంట్‌, రిక్రూట్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ (హెచ్ఆర్‌), కెమిక‌ల్‌, సివిల్‌, కంప్యూట‌ర్‌, ఎల‌క్ట్రిక‌ల‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌, మెకానిక‌ల్‌, అటెండెంట్ ఆప‌రేట‌ర్ (కెమిక‌ల్ ప్లాంట్‌), బాయిల‌ర్ అటెండెంట్‌, ఎల‌క్ట్రిషియ‌న్‌, హార్టిక‌ల్చ‌ర్ అసిస్టెంట్‌, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ (కెమిక‌ల్ ప్లాంట్‌), ల్యాబొరేట‌రీ అసిస్టెంట్ (కెమిక‌ల్ ప్లాంట్‌), మెడిక‌ల్ ల్యాబొరేట‌రీ టెక్నిషియ‌న్ (పాథాల‌జి) విభాగాల్లో ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

ఈ పోస్టుల‌కు అర్హులైన అభ్య‌ర్థులు, ఆస‌క్తి ఉన్న‌వారు ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభం అయింది. డిసెంబ‌ర్ 24వ తేదీలోగా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అభ్య‌ర్థులు https://www.rcfltd.com/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి పూర్తి వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు. విభాగాల వారిగా చూస్తే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు 182 ఖాళీ ఉండ‌గా, టెక్నిషియ‌న్ అప్రెంటిస్ పోస్టులు 90 ఖాళీ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల‌కు గాను అభ్య‌ర్థులు అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్‌, సెక్ర‌టేరియ‌ల్ అసిస్టెంట్‌, రిక్రూట్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ (హెచ్ఆర్‌) విభాగాల్లో అప్లై చేయాలి. బీకామ్‌, బీబీఏ లేదా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తోపాటు ఇంగ్లిష్ భాష‌, కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం క‌లిగి ఉండాలి.

rcfl apprentice recruitment 2024 know the full details

టెక్నిషియ‌న్ అప్రెంటిస్ విభాగంలో కెమిక‌ల్‌, సివిల్‌, కంప్యూట‌ర్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌, మెకానిక‌ల్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులైన వారు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. ట్రేడ్ అప్రెంటిస్ విభాగంలో 106 ఖాళీలు ఉన్నాయి. అటెండెంట్ ఆప‌రేట‌ర్ (కెమిక‌ల్ ప్లాంట్‌), బాయిల‌ర్ అటెండెంట్, ఎల‌క్ట్రిషియ‌న్‌, హార్టిక‌ల్చ‌ర్ అసిస్టెంట్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ మెకానిక్ (కెమిక‌ల్ ప్లాంట్‌), ల్యాబొరేట‌రీ అసిస్టెంట్ (కెమిక‌ల్ ప్లాంట్‌), మెడికల్ ల్యాబొరేట‌రీ టెక్నిషియ‌న్ (పాథాల‌జి) విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ట్రేడ్‌ను అనుస‌రించి 10వ త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి, ఇంట‌ర్ లేదా బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థుల‌కు వ‌య‌స్సు 01.12.2024 నాటికి 25 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు. నెల‌కు రూ.7వేల నుంచి రూ.9వేల వ‌ర‌కు స్ట‌యిపెండ్ ఇస్తారు. ట్రాంబే (ముంబై), థాల్ (రాయ‌గ‌ఢ్ జిల్లా)లో శిక్ష‌ణ ఇస్తారు. సంబంధిత విద్యార్హ‌త‌ల్లో సాధించిన మెరిట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజ‌ర్వేష‌న్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు గాను ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు.