కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు మరికొద్ది రోజులే ఉంది..

కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు మరికొద్ది రోజులే ఉంది..

ఢిల్లీలోని కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ రూర‌ల్ ఎల‌క్ట్రిఫికేష‌న్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (REC Ltd) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 74 పోస్టుల‌ను ప‌లు విభాగాల్లో భ‌ర్తీ చేస్తారు. మేనేజ‌ర్‌, ఆఫీస‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ఇంజినీరింగ్‌, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌, హెచ్ఆర్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, ఫైర్ సేఫ్టీ, కంపెనీ సెక్రెటేరియ‌ట్‌, కార్పొరేట్ క‌మ్యూనికేష‌న్‌, లా, కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ, సెక్రెటేరియ‌ల్‌, రాజ్‌భాష త‌దిత‌ర విభాగాల్లో ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది. రాత ప‌రీక్ష‌, అభ్య‌ర్థుల షార్ట్ లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు గాను డిసెంబ‌ర్ 31ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. మ‌రిన్ని వివ‌రాల‌కు https://recindia.nic.in/home అనే అధికారిక వెబ్‌సైట్‌ను అభ్య‌ర్థులు సంద‌ర్శించ‌వ‌చ్చు. మొత్తం 74 ఖాళీలు ఉండ‌గా డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పోస్టులు 8, జ‌నర‌ల్ మేనేజ‌ర్ పోస్టులు 3, చీఫ్ మేనేజ‌ర్ పోస్టులు 4, మేనేజ‌ర్ పోస్టులు 5, అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టులు 9, ఆఫీస‌ర్ పోస్టులు 36, డిప్యూటీ మేనేజ‌ర్ పోస్టులు 9 ఖాళీగా ఉన్నాయి.

rec limited recruitment 2024 full details

పోస్టుల‌ను అనుస‌రించి అభ్య‌ర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎల్ఎల్‌బీ, సీఏ, సీఎంఏ, ఎంఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌తోపాటు ప‌ని అనుభ‌వం ఉన్న‌వారికి ప్రాధాన్య‌త ఇవ్వ‌బ‌డుతుంది. డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పోస్టుకు 48 ఏళ్లు, జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పోస్టుల‌కు 52 ఏళ్లు, చీఫ్ మేనేజ‌ర్‌కు 45, మేనేజ‌ర్‌కు 42, అసిస్టెంట్ మేనేజ‌ర్‌కు 35 ఏళ్లు, ఆఫీస‌ర్, డిప్యూటీ మేనేజ‌ర్ పోస్టుల‌కు 39 ఏళ్ల‌ను గ‌రిష్ట వ‌యో ప‌రిమితిగా విధించారు. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు పీజు రూ.1000 చెల్లించాలి. రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరిల‌కు చెందిన వారికి ద‌ర‌ఖాస్తు ఫీజులో మిన‌హాయింపు ఇచ్చారు.