RITES ఉద్యోగాలు.. డిగ్రీ లేదా డిప్లొమా చ‌దివితే చాలు..!

RITES ఉద్యోగాలు.. డిగ్రీ లేదా డిప్లొమా చ‌దివితే చాలు..!

గుర్గావ్ లోని రైల్ ఇండియా టెక్నిక‌ల్ అండ్ ఎక‌నామిక్ స‌ర్వీసెస్ (RITES) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల‌కు గాను ఆసక్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ నియామ‌క ప్ర‌క్రియ‌లో భాగంగా ఒప్పంద ప్రాతిపదిక‌న 223 అప్రెంటిస్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న‌వారు ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయ‌వచ్చు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసేందుకు డిసెంబ‌ర్ 25ను చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. అక‌డ‌మిక్స్‌లో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. మ‌రిన్ని వివ‌రాల‌కు అభ్య‌ర్థులు https://www.rites.com/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

మొత్తం 223 ఖాళీలు ఉండ‌గా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు 141, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు 36, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు 46 ఖాళీగా ఉన్నాయి. పోస్టుల‌ను అనుస‌రించి సంబంధిత విభాగాలు లేదా ట్రేడ్‌ల‌లో ఇంజినీరింగ్ డిప్లొమా, ఐటీఐ, ఇంజినీరింగ్ డిగ్రీ (బీఈ, బీటెక్‌, బీఆర్క్‌), నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ (బీఏ, బీబీఏ, బీకామ్‌, బీఎస్సీ, బీసీఏ) చేసి ఉండాలి. అలాగే ప‌ని అనుభ‌వం ఉన్న‌వారికి ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల‌కు నెల‌కు రూ.14వేలు, డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల‌కు నెల‌కు రూ.12వేలు, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల‌కు నెల‌కు రూ.10వేలు ఇస్తారు.

rites offers apprentice posts 2024 recruitment full details

ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇత‌ర వివ‌రాల కోసం పైన ఇచ్చిన వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. ఇక ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు చివ‌రి తేదీ డిసెంబ‌ర్ 25.