Pushpa 2 : పుష్ప‌2పై వైసీపీ నాయ‌కుల ప్రేమ‌.. ఇప్పుడు రోజా కూడా చేరిందిగా..!

Pushpa 2 : పుష్ప‌2పై వైసీపీ నాయ‌కుల ప్రేమ‌.. ఇప్పుడు రోజా కూడా చేరిందిగా..!

Pushpa 2 :  ఇటీవ‌ల విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన పుష్ప‌2 చిత్రంపై వైసీపీ నాయ‌కులు తెగ ప్రేమ కురిపిస్తున్నారు. వైసీపీ నాయ‌కుడు, బ‌న్నీ ఫ్రెండ్ ఇటీవ‌ల పుష్ప‌2ని ఆకాశానికి ఎత్తుతున్నారు. పుష్ప‌2 రిలీజ్ స‌మ‌యంలో వైసీపీ పోస్ట‌ర్స్ వెలిసాయి. అల్లు అర్జున్.. మావాడే అంటూ వైసీపీ నేతలు గర్వంగా చెప్పుకుంటూ తిరుగుతున్నారు. వైసీపీ ముఖ్య నేత అంబటి కూడా ఆ మూవీ రిలీజ్ రోజు నుంచి ప్రమోషన్ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు. ‘పుష్ప 2’ రిలీజ్ నుంచే అంబటి ఉత్సాహంగా ట్వీట్లు వేస్తున్నారు. ఇటీవ‌ల అల్లు అర్జున్‌ను ‘మనవాడు’ అంటూ మూవీ విజయాన్ని వైసీపీ ఖాతాలో వేసే ప్రయత్నం చేశారు. ‘‘ఇండియన్ సినిమా చరిత్రలో మొదటిరోజు రూ.294 కోట్లు కలెక్ట్ చేసినవాడు “మనవాడు” కావడం నాకు ఎంతో గర్వంగా ఉంది’’ అని ట్వీట్ చేశారు.

తాజాగా నటి, మాజీ మంత్రి రోజా పుష్ప 2 సినిమా చూసి తన రివ్యూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. రోజా పుష్ప 2 సినిమా గురించి.. వేటూరి గారు ఒక ఇంటర్వ్యూ లో అంటారు ‘అచ్చమైన తెలుగు నుడికారం రాయలసీమ యాసలో ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు తెలుగులో దాగున్నాయి`అని. లెక్కల మాస్టారు సుకుమార్ గారు మా చిత్తూరు యాస గ్లోబల్ స్క్రీన్ పైన చిందులేయించారు, మీతో ఒక్క మాటలో చెప్పాలంటే సబ్జెక్ట్ ని ఛాలెంజ్ గా తీసుకుని ఒక్క `భాష – యాస`కే కాదు వేషానికి కూడ 100% న్యాయం చేయించారు నటీనటులతో. మా చిత్తూరు యాస లో చెప్పాలంటే ‘ఊరు ఊరంతా… రేయ్ మచ్చా ఎవుడ్రా ఈడు’ అని మాట్లాడుకునేలా చేశారు.

బాక్సాఫీస్ బద్ధలు కొట్టి రికార్డులు తిరగరాస్తున్నాయి. మీరు మూడు గంటల ఇరవై నిమిషాల సేపు ప్రేక్షకులకు ఊపిరాడనివ్వని ఒక సూపర్‌ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. హీరో చీర కట్టుకుని, పసుపు రాసుకుని, గంధం పూసుకుని, నిమ్మకాయల దండ మెడలో వేసుకుని, జాతరలో మాతంగి వేషంలో అల్లు అర్జున్ చెలరేగిపోయి డాన్స్ చేసిన సీన్లు స్క్రీన్ పై‌ అద్భుతంగా చేసి చూపించారు. రష్మిక కూడా సూపర్ అని రాసుకొచ్చింది. దీంతో రోజా రివ్యూ వైరల్ గా మారింది. ఏదేమైన వైసీపీ నాయ‌కులు ఇలా వ‌రుస ట్వీట్స్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. మెగా, అల్లు ఫ్యామిలీల మ‌ధ్య చిచ్చు పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారా అంటూ కామెంట్ చేస్తున్నారు.