Samantha : స‌మంత తండ్రి గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు.. ఆమె ఫాద‌ర్ మన తెలుగు వారేనా?

Samantha : స‌మంత తండ్రి గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు.. ఆమె ఫాద‌ర్ మన తెలుగు వారేనా?

Samantha : అందాల ముద్దుగుమ్మ స‌మంత‌కి ఇప్పుడు బ్యాడ్ టైమ్ న‌డుస్తుంది. నాగ చైత‌న్య‌తో విడాకులు, మ‌యోసైటిస్ బారిన ప‌డ‌డం, అనారోగ్యం వ‌ల‌న సినిమాల‌కి బ్రేక్ ఇవ్వ‌డం ఇలా స‌మంత చాలా స్ట్ర‌గుల్స్ ఫేస్ చేస్తుంది. ఇదే స‌మ‌యంలో స‌మంత్ర తండ్రి హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఈ విష‌యాన్ని స‌మంత త‌న సోషల్ మీడియాలో తెలియ‌జేసింది. “మనం మళ్లీ కలిసే వరకు, నాన్న” అంటూ హార్ట్ ఎమోజిని పోస్ట్ చేసింది. ఓవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సామ్ తన తల్లిదండ్రులను కలిసేందుకు ప్రాధాన్యత ఇస్తుండేది. సినీరంగంలో తనకు ప్రతి క్షణం తన తండ్రి అండగా, మద్దతుగా నిలిచారని తెలిపింది. సామ్ తండ్రి మరణవార్త తెలియడంతో సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సమంత చెన్నైలో జోసెఫ్ ప్రభు, నీనెట్ ప్రభు దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి, తెలుగు ఆంగ్లో-ఇండియన్. సమంత జీవితంలో ఆమె తండ్రి ముఖ్య పాత్ర పోషించారని గతంలో ఎన్నోసార్లు సామ్ చెప్పుకొచ్చింది. స‌మంత తండ్రి ఆంగ్లో ఇండియ‌న్‌గా చెబుతారు కాని జోసెఫ్‌ది తెలుగు స్టేట్ అట. ఆంధ్రప్రదేశ్‌లోనే ఆయ‌న జన్మించారట. ఇక్కడే పెరిగారట. ఆ తర్వాత ఫారెన్‌ వెళ్లారని, అట్నుంచి చెన్నైకి వచ్చారని సమాచారం. సమంత తల్లి నైనిత్తే ప్రభు.. ఆమె మలయాళి. తండ్రి తెలుగు.. ఈ ఇద్దరు పెళ్లి చేసుకుని చెన్నైలో సెటిల్‌ అయ్యారట. సమంతనే ఈ విషయం చెప్పడం విశేషం. ఇక క సమంతకి ఇద్దరు అన్నయ్యలు ఉండ‌గా, ఇంట్లో స‌మంత‌నే చిన్న అమ్మాయి.

స‌మంత ఎక్కువ‌గా తన అన్నల గురించి మాత్రం చెప్పలేదు. అయితే చెన్నైలో అమ్మా నాన్నలు ఓ స్కూల్‌ని నిర్వహించేవారట. దానిని ఫాదర్‌ చూసుకునేవాడట. సమంతనే ఈ విషయం కూడా తెలిపింది. ఇక స్కూల్‌ టైమ్‌లో కొందరు విద్యార్థులు ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉంటే వాళ్లకి ఫీజు పే చేసిందట. అది అందేలా కూడా చూసుకుందట. ఇక స‌మంత తండ్రి ఎక్కువ‌గా మీడియాలో క‌నిపించ‌రు.నాగ చైతన్య, సమంత వివాహం సమయంలో జోసెఫ్‌ ప్రభు మీడియాలో కనిపించారు. ఆ తర్వాత మళ్లీ ఆయన గురించి పెద్దగా చర్చ జరగలేదు. స‌మంత తండ్రి గుండె పోటుతో మృతి చెందారు అనే వార్తలు సమంత ఫ్యాన్స్‌కి తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి. ఆయన మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.