సంజూ శాంసన్ స‌రికొత్త రికార్డ్.. ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయ‌ర్..

సంజూ శాంసన్ స‌రికొత్త రికార్డ్.. ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయ‌ర్..

అవ‌కాశాల కోసం ఎదురు చూస్తున్న సంజూ శాంస‌న్ సౌతాఫ్రికా టూర్‌లో ఓపెన‌ర్‌గా అవకాశం ద‌క్కించుకోగా, ఇప్పుడు ఆ సిరీస్‌లో స‌రికొత్త రికార్డులు కూడా సృష్టించాడు.భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జోహన్నెస్‌బర్గ్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన 4వ టీ20 మ్యాచ్‌లో శాంస‌న్‌తో పాటు తిలక్ వ‌ర్మ వీర విహ‌రం సృష్టించ‌డంతో టీమిండియా 20 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఏకంగా 283 పరుగులు సాధించింది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో సెంచరీతో సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఒక క్యాలెండర్ ఏడాదిలో మూడు టీ20 సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా అవతరించాడు. ఇదే సిరీస్‌లో తొలి టీ20లో సంజూ సెంచరీ నమోదు చేశారు.

అంతకుముందు బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో హైదరాబాద్ వేదికగా సంజూ శతకం నమోదు చేశాడు. దీంతో ఈ ఏడాది మూడు సెంచరీలు నమోదు చేసినట్టు అయింది. కాగా జోహన్నెస్‌బర్గ్ టీ20లో సంజూ శాంసన్ కేవలం 56 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 109 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. అంతకుముందు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయినప్పటికీ అతడి ఫామ్‌పై ప్రభావం చూపలేదు. మరో సెంచరీ హీరో తిలక్ వర్మతో కలిసి రెండవ వికెట్‌కు ఏకంగా 210 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. టీ20 ఫార్మాట్‌లో భారత్‌ తరపున ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో రెండవ వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యంగా ప్రపంచ రికార్డు నమోదయింది.

sanju samson creates another record in t20 cricket

తాజా సెంచ‌రీతో ఇంగ్లండ్ వికెట్ కీపర్ ఫిల్ సాల్ట్‌ను సంజూ శాంసన్ అధిగమించాడు. ఫిల్ సాల్ట్ అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకు 2 శతకాలు నమోదు చేశాడు. వికెట్ల కీపర్లలో సంజూ, సాల్ట్ మాత్రమే అంతర్జాతీయ టీ20ల్లో ఒకటి కంటే ఎక్కువ శతకాలు నమోదు చేశారు. టీ20ల్లో భారత తరఫున అత్యధిక సెంచరీలు నమోదు చేసిన మూడో బ్యాటర్‌గానూ సంజూ శాంసన్ నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌లు సంజూ శాంసన్ కంటే ముందున్నారు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో మూడు టీ20 శతకాలు నమోదు చేసిన తొలి బ్యాటర్‌గా సంజూ శాంసన్ నిలిచాడు.అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన తొలి భారత వికెట్ కీపర్‌గానూ సంజూ చరిత్రకెక్కాడు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్(3), ఇషాన్ కిషన్(3), మహేంద్ర సింగ్ ధోనీ(2), రిషభ్ పంత్‌లను సంజూ వెనక్కినెట్టాడు.