ఎస్‌బీఐలో ప్రత్యేక పోస్ట్‌లకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ sbi.co.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 169 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 22న ప్రారంభమై డిసెంబర్ 12, 2024న ముగుస్తుంది. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాల కోసం కింద వివరాలు చెక్ చేయండి.. అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- సివిల్): 42 పోస్టులు,అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- ఎలక్ట్రికల్): 25 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- ఫైర్): 101 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- సివిల్): 1 పోస్టు.
ఇక ఈ పోస్ట్‌కి సంబంధించిన అర్హత చూస్తే.. ద్యార్హత, వయోపరిమితి తదితర వివరాలను ఎస్బీఐ వెబ్ సైట్ లోని డీటెయిల్డ్ నోటిఫికేషన్ లో తెలుసుకోవచ్చు. అన్ని పోస్టులకు: ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటరాక్షన్, అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- ఫైర్): షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటరాక్షన్.ఆన్లైన్ రాత పరీక్షను 2025 జనవరిలో నిర్వహిస్తారు. పరీక్ష కాల్ లెటర్ ను పరీక్షకు కొన్ని రోజుల ముందు బ్యాంక్ వెబ్సైట్లో అప్లోడ్ చేసి, ఎస్ఎంఎస్, ఈ-మెయిల్స్ ద్వారా అభ్యర్థులకు సమాచారం ఇస్తారు. ఈ పరీక్షలో జనరల్ ఆప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ అనే రెండు పేపర్లు ఉంటాయి. జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 90 నిమిషాలు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ 45 నిమిషాల వ్యవధి ఉంటుంది. ఆన్ లైన్ రాత పరీక్షలో తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉండవు. ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ (100 మార్కులకు), ఇంటర్వ్యూ (25 మార్కులకు) మార్కులను కలిపి 70:30 వెయిటేజీతో తుది మెరిట్ జాబితాను రూపొందిస్తారు.
జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు, ఇన్ఫర్మేషన్ ఛార్జీలు రూ.750, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు ఎలాంటి ఫీజు/ ఇన్ఫర్మేషన్ ఛార్జీలు ఉండవు. డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డ్/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.వయోపరిమితి అనేది చూస్తే.. 01.10.2024 నాటికి అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- ఫైర్) పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు.. ఇతర పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్ 12, 2024 కాగా, ఫీజు చెల్లింపునకు చివరితేది: డిసెంబర్ 12, 2024.