Shraddha Arya : క‌వ‌ల‌ల‌కి జ‌న్మ‌నిచ్చిన టాలీవుడ్ అందాల హీరోయిన్.. శుభాకాంక్ష‌లు చెబుతున్న నెటిజ‌న్స్

Shraddha Arya : క‌వ‌ల‌ల‌కి జ‌న్మ‌నిచ్చిన టాలీవుడ్ అందాల హీరోయిన్.. శుభాకాంక్ష‌లు చెబుతున్న నెటిజ‌న్స్

Shraddha Arya : ఈ మ‌ధ్య టాలీవుడ్ ముద్దుగుమ్మ‌లు ఒక్కొక్క‌ళ్లుగా పెళ్లి పీట‌లు ఎక్కుతున్నారు. అక్క‌డితో ఆగ‌కుండా వెంట‌నే పిల్ల‌లని కూడా కంటున్నారు. గతంలో పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన శ్రద్ధా ఆర్య శుభవార్త చెప్పింది. అమ్మగా ప్రమోషన్ పొందానంటూ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. అయితే ఆమె ఒక్కరికి జ‌న్మ‌నివ్వ‌లేదు. ఎకంగా ఇద్ద‌రు క‌వ‌ల‌ల‌కి జ‌న్మ‌నిచ్చింది. అందులో ఒకరు అమ్మాయి కాగా, మ‌రొక‌రు అబ్బాయి. ఇందుకు సంబంధించిన వీడియోని త‌న సోష‌ల్ మీడియాలో పంచుకుంది శ్ర‌ద్ధా.

 

నవంబర్ 29న తనకు ప్రసవం జరిగిందని ఇప్పుడు అందరమూ క్షేమంగానే ఉన్నామంటూ అందులో చెప్పుకొచ్చింది. ‘ ఈరెండు చిన్ని హృదయాలు మా కుటుంబాన్ని సంపూర్ణం చేశాయి. మా మనసులు రెండింతల సంతోషంతో నిండిపోయింది’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది శ్రద్ద. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. య‌ పంజాబ్ కు చెందిన శ్రద్ధ 2006లో కల్వనిన్ కదాలి అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత హిందీలో నిశ్శబ్ద్‌ తో పాటు పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. 2007లో గొడవ సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అందాల తార ఆ త‌ర్వాత కూడా ప‌లు సినిమాలు చేసింది.

గొడ‌వ చిత్రాన్ని కోదండ రామిరెడ్డి తెరకెక్కించగా, ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో వైభవ్ హీరోగా నటించాడు. దీని తర్వాత రోమియో, కోతిమూక తదితర తెలుగు సినిమాల్లో కనిపించింది శ్రద్ధ. ఇప్పుడు తెలుగు సినిమాలు చాలా త‌గ్గించింది. ఈ అమ్మ‌డు తెలుగుతో పాటు కన్నడ, పంజాబీ చిత్రాల్లోనూ నటించిన శ్రద్ధ 2021లో నేవీ ఆఫీసర్ రాహుల్ నగల్‌తో కలిసి ఏడడుగులు వేసింది. రాహుల్ నాగల్‌ అనే నేవీ ఆఫీసర్ కాగా, మూడేళ్ల వైవాహిక బంధానికి ప్రతీకగా పండంటి బిడ్డల‌ను తమ జీవితంలోకి ఆహ్వానించారు ఈ దంప‌తులు.