Sneha-Prasanna : విడాకుల‌పై తొలిసారి నోరు విప్పిన స్నేహ‌.. అది వారి వ్యక్తిగ‌తం అంటూ కామెంట్..!

Sneha-Prasanna : విడాకుల‌పై తొలిసారి నోరు విప్పిన స్నేహ‌.. అది వారి వ్యక్తిగ‌తం అంటూ కామెంట్..!

Sneha-Prasanna : ఈ మ‌ధ్య కాలంలో సెల‌బ్రిటీల విడాకుల వార్త‌లు హాట్ టాపిక్ అవుతున్నాయి. పెళ్లి చేసుకున్న మూడు నాలుగేళ్ల త‌ర్వాత కొంద‌రు త‌మ బంధానికి బ్రేక‌ప్ చెప్పుకుంటుంటే మ‌రి కొంద‌రు పాతికేళ్ల వైవాహిక జీవితం త‌ర్వాత విడిపోయేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ విడాకుల వ్య‌వ‌హారం అభిమానుల‌ని అయితే ఎంత‌గానో క‌లిచి వేస్తుంద‌నే చెప్పాలి. అయితే న‌టి స్నేహ కూడా త‌న భ‌ర్త నుండి విడాకులు తీసుకుంటుంది అని గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఆమె పూర్తి క్లారిటీ ఇచ్చింది. టాలీవుడ్ హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్ష‌కుల మ‌న‌సు గెలుచుకుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకున్న స్నేహ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన స్నేహ.. కుర్ర హీరో,హీరోయిన్లకు వదినగా, అక్క పాత్రలలో నటిస్తూ మెప్పిస్తుంది.. మ‌రోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన ఫ్యామిలీ ఫోటోస్, క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ అల‌రిస్తుంది. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే కోలీవుడ్ నటుడు ప్రసన్నను వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఇక పెళ్లి తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న స్నేహ ఈమధ్యనే నటిగా రీఎంట్రీ ఇచ్చింది.

కొన్ని నెలల క్రితం స్నేహ.. తన భర్త ప్రసన్నకు విడాకులు ఇస్తుందని వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి ఉండడం లేదని సోషల్ మీడియాలో తెగ ప్ర‌చారాలు జ‌రిగాయి. తాజాగా వాటికి క్లారిటీ ఇచ్చింది. తాజాగా స్నేహ.. చీరల వ్యాపారంలోకి అడుగు పెట్టింది. స్నేహాలయం అనే పేరుతో చీరల వ్యాపారం స్టార్ట్ చేసిన నేప‌థ్యంలో మీడియాతో ముచ్చటించారు. విడాకుల పరంపర గురించి ఓ రిపోర్ట‌ర్ ప్రశ్నించగా.. స్నేహ- ప్రసన్న తమదైన రీతిలో సమాధానం ఇచ్చారు. విడాకులు అనేది వారి వ్యక్తిగత నిర్ణయం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అనేది మనం చెప్పలేము. అది తెలియనప్పుడు.. వాటి గురించి, వారి గురించి స్పందించే అధికారం మాకు లేదు” అంటూ చెప్పుకొచ్చారు. దీని త‌ర్వాత కొంద‌రు స్నేహ‌- ప్ర‌సన్న జోడికి జిష్టి పెట్టొద్ద‌ని కామెంట్ చేస్తున్నారు.