Sobhita Dhulipala: శోభిత ప్లేస్‌లో కుక్క‌ని పెట్టారా.. ముంబైలో అంత తీవ్ర అవ‌మానం జ‌రిగిందా?

Sobhita Dhulipala: శోభిత ప్లేస్‌లో కుక్క‌ని పెట్టారా.. ముంబైలో అంత తీవ్ర అవ‌మానం జ‌రిగిందా?

Sobhita Dhulipala : శోభిత ధూళిపాళ్ల‌.. ఈ పేరు ఒక‌ప్పుడు ఎవ‌రికి అంత‌గా తెలిసేది కాదు. కాని ఎప్పుడైతే నాగ చైతన్య‌ని ఎంగేజ్‌మెంట్ చేసుకుందో శోభిత ధూళిపాళ్ల పేరు మారుమ్రోగిపోతుంది. శోభిత తెలుగు అమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్ ద్వారా సినిమాకి పరిచయం అయ్యింది. అటు హిందీ, ఇటు తెలుగు సినిమాలు చేస్తూ రాణిస్తుంది. అయితే ఆమె చాలా సెలక్టీవ్‌గా వెళ్తుంది. ఏది పడితే అది చేయడం లేదు. సినిమాలో దమ్ము, పాత్రకి ప్రయారిటీ ఉంటేనే చేస్తుంది. అలా ఉంటే తన పాత్ర ఎంతటి బోల్డ్ గా ఉన్నా చేయడానికి రెడీ అంటోంది. అయితే ఇంత బోల్డ్‌గా ఉండే శోభిత‌ని నాగ చైత‌న్య ప్రేమ‌లో దింపాడు.

ఆగ‌స్ట్ 8న నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇక‌ ఈ రోజు(డిసెంబర్‌ 4) రాత్రి 8.13 గంటలకు శోభితా పెళ్లి హీరో నాగచైతన్యతో జరగబోతున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోలో అతికొద్ది మంది సినిమా సెలబ్రిటీ, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరగబోతుందట. నాగచైతన్యకిది రెండో పెళ్లి కాగా, శోభిత‌కి తొలి వివాహం. శోభితా దూళపాళ తండ్రి నేవీ అధికారి. తెనాలిలో పుట్టి వైజాగ్‌లో పెరిగింది. ముంబయిలో ఉన్నత స్టడీస్ చేసిన ఆమె మెడ‌లింగ్‌కి వెళ్లి ఆ త‌ర్వాత సినిమాల్లోకి వచ్చింది. అయితే మోడలింగ్‌ సమయంలో తాను చాలా అవమానాలు ఫేస్‌ చేసినట్టు తెలిపింది శోభిత.

ప్రారంభంలో నల్లగా ఉందని తిరస్కరించారట. ఆ తర్వాత అందులోనూ రాణించి ఫెమినా మిస్‌ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ గెలుచుకుంది. అలాగే మిస్‌ ఎర్త్ 2013లో కూడా పాల్గొంది. ఓ యాడ్‌ కోసం ఆడిషన్‌కి వెళ్లిందట శోభితా. నల్లగా ఉందని రిజెక్ట్ చేశారట. వెనకాల నిల్చునే బ్యాక్‌ మోడల్‌గానూ పనికి రాదని అవమానించారట. మరో ఆడిషన్‌కి వెళితే కెమెరా రిపేర్‌ అయ్యిందని నెక్ట్స్ డే రమ్మన్నారు. ఆ రోజు వెళ్లితే శోభితా కాన్ఫిడెన్స్ ని చూసి షాక్ అయ్యారట. ఈ బ్రాండ్‌కి ఆమె సెట్‌ కాదని అన్నారట. ఆమె స్థానంలో ఓ కుక్కని పెట్టారట. కానీ తనకు మాత్రం పారితోషికం కూడా చెల్లించినట్టు తెలిపింది శోభిత. తన స్థానంలో కుక్కని పెట్టుకోవడం చాలా అవమానంగా అనిపించిందని ఓ ఇంగ్లీష్‌ ఇంటర్వ్యూలో తెలిపింది శోభిత‌.