Sobhita : వామ్మో.. పెళ్లిలో శోభిత ధ‌రించిన న‌గలు, చీర‌ ధ‌ర ఎంతో తెలిస్తే ఉలిక్కిప‌డ‌తారు..!

Sobhita : వామ్మో.. పెళ్లిలో శోభిత ధ‌రించిన న‌గలు, చీర‌ ధ‌ర ఎంతో తెలిస్తే ఉలిక్కిప‌డ‌తారు..!

Sobhita : దాదాపు రెండేళ్లు ప్రేమ‌లో ఉన్న నాగ చైత‌న్య‌-శోభిత‌లు ఎట్ట‌కేల‌కి వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు.డిసెంబ‌ర్ రాత్రి ఘనంగా వారి వివాహం ఇరు కుటుంబాల పెద్దలు, ఆత్మీయుల సమక్షంలో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో అట్ట‌హాసంగా జ‌రిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన అనేక విష‌యాలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇక పెళ్లిలో శోభిత ధరించిన న‌గ‌లు, చీర గురించి చ‌ర్చ న‌డుస్తుంది. వాటి ధ‌ర ఎంత‌నే దానిపై ఇప్పుడు హాట్ హాట్‌గా డిస్క‌ష‌న్ పెడుతున్నారు.

పెళ్ళిలో శోభితా ఆధునిక పద్దతులను పక్కన పెట్టి అచ్చ తెలుగు సంప్రదాయాలకు తగ్గట్టు రెడీ అయ్యింది. పసుపు దంచడం దగ్గరనుంచి పెళ్లి వరకు కూడా అక్కినేని కోడలు తెలుగుదనం చూపిస్తూనే ఉంది. ఇక పెళ్లిలో ప్రముఖ డిజైనర్ నీతూ లుల్లా డిజైన్ చేసిన కంజీవరం సిల్క్ చీరను ధరించింది. బంగారు రంగు వర్ణంలో మెరిసిపోతున్న ఆ పట్టుచీరపై.. మరింత వన్నెతెచ్చేలా ఏడువారాల నగలను ధరించింది. అవి అన్ని కూడా శోభితా అమ్మ, అమ్మమ్మల నగలని తెలుస్తోంది. పూర్వం ఎక్కువగా వాడే.. కంఠహారాలు, కంకణాలు, మాతపట్టి, బుల్లకి, సూర్యచంద్రుల మోటిఫ్‌లు, వంకీలు, కమర్‌ బాండ్ మరియు బాజుబాండ్‌ లను ధరించి.. అచ్చ తెలుగు వధువులా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది శోభిత‌

త‌లంబ్రాల చీర‌ని కూడా ప్ర‌త్యేకంగా చేయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పొందూరులో నేసిన సాధారణ తెల్లటి ఖాదీ చీరను ధరించి, దానిపై నిండుగా ఆభరణాలను ధరించింది.వీట‌ని చూసి ప్రతి ఒక్క‌రు వాటి ధ‌ర ఎంత అయి ఉంటుంది అని ఆరాలు తీయడం మొద‌లు పెట్టారు. మ‌న‌కు అందుతున్న స‌మాచారం ప్ర‌కారం శోభితా పెళ్లి చీర.. 30,000 నుండి 2.15 లక్షలోపు ఉంటుందని అంటున్నారు. ఇక పొందూరు ఖాదీ చీర.. పదివేలకు పైనే ఉంటుందని సమాచారం. పెళ్లి చీరలకు, నగలకు ఎక్కువ డబ్బులు పెట్టకుండా.. అక్కినేని కోడలు ఎంతో తెలుగుదనం ఉట్టిపడేలా క‌నిపించ‌డంపై అంద‌రు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇక వీరి పెళ్లికి నాగార్జున, వెంకటేశ్‌, అఖిల్‌తోపాటు ఇతర కుటుంబసభ్యులు వేదికపై కనిపించి సంద‌డి చేశారు.