ఆంధ్రప్రదేశ్‌లో పలువురు మంత్రుల పేషీల్లో పనిచేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఐ అండ్ పీఆర్ విభాగం వారు నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఏపీ మంత్రుల పేషీల్లో ఖాళీగా ఉన్న సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు గాను అభ్యర్థులు పలు అర్హతలను కలిగి ఉండాలి. విద్యార్హతల విషయానికి వస్తే.. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్టులకు బీఈ లేదా బీటెక్, సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి.
సంబంధిత శాఖల పనితీరుపై అభ్యర్థులకు అవగాహన ఉండాలి. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఎండీ చైర్మన్ గా, సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌లు సభ్యులుగా ఉన్న కమిటీ ఈ పోస్టులకు సంబంధించి అర్హులను ఎంపిక చేస్తుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 2 నెలల పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తయ్యాక అభ్యర్థి పనితీరును మదింపు చేస్తారు.
ఏడాది కాల పరిమితితో పొరుగు సేవల ప్రాతిపదికన వీరిని ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌లకు నెలకు రూ.50వేలు, సోషల్ మీడియా అసిస్టెంట్లకు నెలకు రూ.30వేలు వేతనం చెల్లిస్తారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ లేదా ఐ అండ్ పీఆర్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.