South Central Railway Recruitment 2024 : దక్షిణ మధ్య రైల్వే వారు పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. సికింద్రాబాద్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా కింద గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తం 14 పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 10వ తరగతి పాస్ అయి ఉండాలి. లేదా ఐటీఐ, ఇంటర్ చదివిన వారు కూడా అర్హులే. అభ్యర్థులు స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్‌టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపులు ఇస్తారు. అభ్యర్థులను రాత పరీక్ష, పత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో 40 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. అలాగే 1 వ్యాసం తరహా ప్రశ్న ఉంటుంది. దీనికి 20 మార్కులను కేటాయిస్తారు. ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ మీద ఉంటాయి.
అభ్యర్థులు తమ విద్యార్హతలకు చెందిన ధ్రువపత్రాలతోపాటు కుల ధ్రువీకరణ పత్రం, స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికెట్, ఇతర పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం రూ.50వేల వరకు చెల్లిస్తారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అదనపు ప్రయోజనాలను సైతం కల్పిస్తారు. అలాగే అలవెన్స్‌లను కూడా ఇస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు జనరల్, ఓబీసీ విభాగాలకు చెందిన వారు రూ.500, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు రూ.250 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. అభ్యర్థులు తమ 10వ తరగతి, ఇంటర్ సర్టిఫికెట్లు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్, దరఖాస్తు ఫామ్‌లను సమర్పించారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 23 నుంచి ప్రారంభం కాగా దరఖాస్తు చేసేందుకు గాను డిసెంబర్ 22ను చివరి తేదీగా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు https://scr.indianrailways.gov.in/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను అభ్యర్థులు సందర్శించవచ్చు.