Chiranjeevi-Nani : చిరంజీవి, నాని కాంబినేష‌న్‌లో ఊహించ‌ని ప్రాజెక్ట్‌.. ద‌ర్శ‌కుడు ఎవ‌రో తెలుసా?

Chiranjeevi-Nani : చిరంజీవి, నాని కాంబినేష‌న్‌లో ఊహించ‌ని ప్రాజెక్ట్‌.. ద‌ర్శ‌కుడు ఎవ‌రో తెలుసా?

Chiranjeevi-Nani : ఇటీవ‌ల టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఊహించ‌ని కాంబినేష‌న్స్ సెట్ అవుతున్నాయి. స్టార్ హీరోలంద‌రు క‌లిసి ప‌ని చేస్తుండ‌డంతో ప్రేక్ష‌కుల ఆనందం అవ‌ధులు దాటుతుంది. గ‌త కొద్ది రోజులుగా చిరంజీవి సినిమా గురించి నెట్టింట అనేక ప్ర‌చారాలు జ‌రుగుతుండ‌గా,దీనిపై క్లారిటీ వ‌చ్చింది. కొన్నాళ్లుగా చిరంజీవి యంగ్ డైరెక్ట‌ర్స్‌కి అవ‌కాశాలు ఇస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. చాలా కాలం తర్వాత చిరంజీవిని సోషియో ఫాంటసీ కథాంశంతో వశిష్ట ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

తనను చూస్తూ పెరిగిన వారికి తనను సినిమాలో ఎలా చూపించాలో బాగా తెలుసు కాబ‌ట్టి కొత్త వారితో సినిమాలు చేస్తూ వస్తున్నారు. విశ్వంభర సినిమా పూర్తి కాకుండానే శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో సినిమాను చేయబోతున్నారు.చిరంజీవి న‌టించే త‌దుప‌రి చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించేంది ‘ద‌స‌రా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల అని అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. మ‌రో విశేషం ఏంటంటే ఈ చిత్రాన్ని నేచుర‌ల్ స్టార్ నాని నిర్మించ‌నున్నారు. సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌తో క‌లిసి నాని త‌న‌ యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ని మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు.

ప్ర‌త్యేక‌మైన పోస్ట‌ర్ ఒక‌టి విడుద‌ల చేయ‌గా,ఆ పోస్ట‌ర్‌లో రక్తం కారుతున్న చిరు చేతిని చూపించారు. దీనికి ‘అతను హింసలో శాంతిని పొందుతాడు’ అనే క్యాప్షన్ ఇచ్చారు.”ఆయన స్ఫూర్తితోనే నేను పెరిగాను. ప్రతిసారి ఆయన కోసం గంటల తరబడి లైన్‌లో నిలబడ్డాను. ఈ క్రమంలో నా సైకిల్ కూడా కోల్పోయాను. ఆయనతోనే సెలబ్రేషన్స్ చేసుకున్నాను. ఇప్పుడాయనని సమర్పిస్తున్నాను. ఇది ఫుల్ సర్కిల్” అంటూ నాని ట్వీట్ చేశారు. అయితే ఇక్క‌డ విశేష‌మేమిటంటే నాని గ‌త చిత్రం ద‌స‌రాని శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేయ‌గా, ఇప్పుడు నాని నిర్మిస్తున్న చిత్రానికి కూడా శ్రీకాంత్ డైరెక్ట‌ర్ కావ‌డం. మ‌రోవైపు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి న‌టిస్తున్న‌ విశ్వంభర చిత్రం వచ్చే ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది.