సాధారణంగా రంగు, రుచి, చిక్కదనం..ఈ మూడు పదాలు వినగానే మనకు టక్కున గుర్తొచ్చే పదం టీ..ఉదయం నిద్ర లేచింది మొదలు..కమ్మటి కాఫీయో, టీ యో గానీ తాగకపోతే మనకకి ఏం తోచదు. గడగడ లాడించే చలిలో ఒక్క కప్పు టీ తాగితే చాలు ఆ కిక్కే వేరనిపిస్తుంది. అయితే టీలో పాలు, పంచదార వేయనంత మాత్రాన టీ ఆరోగ్యకరమని చాలా మంది భావిస్తారు. అయితే కొంత మంది టీలో బెల్లం కలిపి తాగుతారు. ఇది అజీర్ణం మరియు మధుమేహం ప్రమాదాన్ని సృష్టిస్తుంది. తో పాటు ఉప్పు, సమోసాలు లేదా చాట్-పకోరీలను ఎప్పుడూ తినకండి.
‘కాంట్రారీ డైట్’ అని కూడా పిలువబడే చెడు కలయికలతో కూడిన ఆహార పదార్థాలు, ఇవన్నీ ఆటో ఇమ్యూన్ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయని డాక్టర్ రాబిన్ చెప్పారు. వాటి ద్వార వచ్చే వ్యాధుల జాబితా చూస్తే.. టైప్ 1 డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ , సోరియాటిక్ ఆర్థరైటిస్, మల్టిపుల్ స్క్లెరోసిస్, ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి, సమాధులు వ్యాధి , స్జోగ్రెన్సా వ్యాధి, మస్తీనియా గ్రావిస్, సెలియక్ వ్యాధి, హానికరమైన రక్తహీనత వంటి వ్యాధులు మన చెంత చేరే అవకాశం ఉందని అంటున్నారు. టీ తాగేవారి కంటే… పాలు కలపకుండా… టీ డికాక్షన్ తాగేవారి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా డికాక్షన్ మన బ్రెయిన్‌కి మంచిచేస్తుందట.
సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనం మేరకు..డికాక్షన్ తాగేవారి బ్రెయిన్…70 ఏళ్లు దాటిన వారిలో సైతం చురుగ్గా పనిచేస్తుందట. ఇది..బ్రెయిన్ పనితీరును పెంచడమే కాకుండా..మెదడుకు రక్షణ కవచంలా ఉంటుందని చెబుతున్నారు. డికాక్షన్‌తో మన ఆరోగ్యం మెరుగవ్వడమే కాదు… గుండె జబ్బులను కూడా పోగొడుతుంది. ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది. బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. వారానికి 4 సార్లు గ్రీన్ టీ, బ్లాక్ టీ లాంటివి తాగేవాళ్ల బ్రెయిన్ బ్రహ్మాండంగా పనిచేస్తోందని చాలా పరిశోధనల్లో తేలింది.