Anasuya : అనసూయ.. ఒకప్పుడు ఈ అమ్మడు జస్ట్ యాంకర్ మాత్రమే. ఇప్పుడు మాత్రం మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. రంగమ్మత్త చిత్రంతో నటిగా పేరు ప్రఖ్యాతలు అందుకున్న ఈ భామ ఆ తర్వాత పుష్పలో నటించి దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు పుష్ప2లో కూడా తన టాలెంట్‌తో అందరి మనస్సులు కొల్లగొట్టింది. రోజు రోజుకి నటిగా అనసూయ క్రేజ్ అమాంతం పెరుగుతూ పోతుంది. అయితే అనసూయ క్రేజ్‌ని బట్టి పలు షాపింగ్ మాల్ యజమానులు ఓపెనింగ్‌కి పిలుస్తున్నారు. తాజాగా యాంకర్ అనసూయ మైదుకూరు టూర్ వెళ్లగా, అది స్థానికులకు సమస్యగా మారింది.
స్థానికంగా ఒక వస్త్ర దుకాణం ప్రారంభానికి అనసూయ వస్తుండటంతో అధికారులు అతిగా స్పందిస్తున్నారు. వస్త్ర దుకాణం ప్రారంభానికి ముందే మైదుకూరు ఆర్టీసీ అధికారులు బస్టాండ్ మెయిన్ ద్వారం మూసేశారు. దీంతో, ఉద్యోగులు .. విద్యార్ధులు ఇబ్బందులు పడ్డారు. అదే రోజు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందు కు తమ పిల్లలతో కలిసి పేరెంట్స్ బస్టాండ్ వద్దకు చేరుకునే సరికి ప్రధాన ద్వారా మూసివేసి ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేసారు. సాధారణంగా ఎవరైనా రాష్ట్ర స్థాయి నాయకులు, లేదా ముఖ్యమైన నేతలు వస్తేనో, లేదా కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు రోడ్లను భ్యారికేడ్లతో మూసి వేస్తారు.
కాని సినీ తార అయిన అనసూయ ఒక షాపు ఓపెనింగ్ కు వచ్చిందని ప్రజా రవాణాకు సంబంధించిన బస్టాండ్ ను ఆర్టీసీ అధికారులు బారికేట్లతో మూసేయడం అందరిని ఆశ్చర్యపరచింది. ప్రయాణికులు ఆర్టీసీ అధికారుల తీరును దుమ్మెత్తి పోశారు. అయితే షాపు పక్కనే బస్టాండ్ కు ఉండడం , అనసూయని చూసేందుకు చాలామంది స్థానిక ప్రజలు చేరుకోవడం, వారంతా వారి వాహనాల పార్కింగ్ ను బస్టాండ్ లో పెట్టి అక్కడికి చేరుకోవడంతో బస్టాండ్ లోనికి రానివ్వకుండా బారికెట్లను పెట్టారు … అయితే దానివల్ల బస్సులు కూడా లోపలికి రావటం ఆగిపోయాయి. ఆర్టీసీ అధికారులు ఒకందుకు చేస్తే అది తీరా వారి మెడకే చుట్టుకుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని కొందరు వాపోతున్నారు.