డిసెంబర్ తొలి వారం ‘పుష్ప’రాజ్ రూల్ చేయబోతున్నాడు. ప్రేక్షకులకు వినోదం పంచేందుకు ‘పుష్ప2: ది రూల్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 5న రానున్న పుష్పరాజ్ సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీకి పోటీగా థియేటర్స్‌లో మరే సినిమా విడుదల కావడం లేదు. మరి ఓటీటీలో విడుదల అవుతున్నాయా అంటే చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. ఓటీటీలో శివ కార్తికేయన్, సాయి పల్లవి కీలక పాత్రల్లో నటించిన అమరన్ ఓటీటీలో విడుదలకానుంది. దీని కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.నెట్‌ఫ్లిక్స్ లో చూస్తే.. చర్చిల్ ఎట్ వార్- డిసెంబరు 04, దట్ క్రిస్మస్- డిసెంబరు 04, ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా- డిసెంబరు 04, ది అల్టిమేటమ్- డిసెంబరు 04, బ్లాక్ డవ్జ్- డిసెంబరు 05, ఎ నాన్సెన్స్ క్రిస్మస్- డిసెంబరు 06, బిగ్గెస్ట్ హైస్ట్ ఎవర్- డిసెంబరు 06, జిగ్రా- డిసెంబరు 06, మేరీ- డిసెంబరు 06, విక్కీ విద్యా కా వో వాలా వీడియో- డిసెంబరు 06న స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ లో చూస్తే.. జాక్ ఇన్‌టైమ్ ఫర్ క్రిస్మస్- డిసెంబరు 03, పాప్ కల్చర్ జెప్పడీ- డిసెంబరు 04, అగ్ని- డిసెంబరు 06, ది స్టిక్కీ- డిసెంబరు 06,స్మైల్ 2 (ఇంగ్లీష్ హారర్ మూవీ) (రెంటల్ విధానంలో)- డిసెంబర్ 4, అగ్ని (హిందీ యాక్షన్ డ్రామా మూవీ)- డిసెంబర్ 6, ది స్టిక్కీ (హిస్టరీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 6 నుండి స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక డిస్నీ+ హాట్‌స్టార్ లో చూస్తే.. ది ఒరిజినల్- డిసెంబరు 03 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక లైట్ షాప్- డిసెంబరు 04 నుండి స్ట్రీమింగ్ కానుంది. జియో సినిమా లో క్రియేచ్ కమాండోస్, డిసెంబరు 06, లాంగింగ్, డిసెంబరు 07 నుండి స్ట్రీమింగ్ కానుంది.
జీ5 లో మైరీ- డిసెంబరు 06 నుండి స్ట్రీమింగ్ కానుంది. సోనీలివ్‌లో తానవ్2 – డిసెంబరు 06 నుండి స్ట్రీమింగ్ కానుంది. బుక్ మై షో లో స్మైల్2- డిసెంబరు 04 నుండి స్ట్రీమింగ్ కానుంది. వాటిలో యాక్షన్ థ్రిల్లర్స్, రివేంజ్ క్రైమ్ డ్రామా, హారర్, బోల్డ్ అండ్ రొమాంటిక్ జోనర్ సినిమాలు వెబ్ సిరీస్ లు ఉన్నాయి. అయితే జిగ్రా, యాక్షన్ డ్రామా అగ్ని, హారర్ మూవీ స్మైల్ 2, రివేంజ్ థ్రిల్లర్ సిరీస్ మైరీ, తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తానవ్ 2, తృప్తి దిమ్రి బోల్డ్ అండ్ రొమాంటిక్ మూవీ విక్కీ విద్యా కా వో అనే సినిమాలపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి