Tollywood : పండగలకి సరికొత్త సినిమాలు రిలీజ్ కావడం కొత్తేమి కాదు. ఇటీవలి కాలంలో కొందరు చిత్ర నిర్మాతలు పండగలని టార్గెట్ చేస్తూ ప్రేక్షకులకి పసందైన వినోదం పంచే ప్రయత్నం చేస్తున్నారు. క్రిస్మస్ కొద్ది రోజుల ముందే పుష్ప2 రిలీజ్ కానుండడంతో ఈ సినిమా నుండే జాతర మొదలు కానుంది. డిసెంబర్లో ‘పుష్ప 2’తో పాటు ఏకంగా 12 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. పుష్ప 2 : ది రూల్’. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ వరల్డ్ సినిమాగా, ఆరు భాషల్లో, 12,000లకు పైగా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.ఇక వేదిక హీరోయిన్ గా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఫియర్’. ఈ సినిమా డిసెంబర్ 14న క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ పలు అంతర్జాతీయ అవార్డులు కూడా సొంతం చేసుకుంది.
హాలీవుడ్ మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ‘ముఫాస : ది లయన్ కింగ్’ సినిమా కూడా డిసెంబర్‌లో రిలీజ్ కానుంది.. ఈ సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించడంతో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తెలుగులో డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఈ సినిమా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించనుంది. ఇక అల్లరి నరేష్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘బచ్చల మల్లి’. 1990 నేపథ్యంలో నరేష్ ట్రాక్టర్ డ్రైవర్ గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ దక్కింది.
విలక్షణ నటుడు ఉపేంద్ర తాజా చిత్రం ‘యుఐ మూవీ’. ఈ మూవీ కూడా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేయనుంది. మరోవైపు విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘విడుదలై’. దీనికి సీక్వెల్ గా ‘విడుదలై పార్ట్ 2’ డిసెంబర్ 20న రిలీజ్ కానుంది.మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన మూవీ ‘సారంగపాణి జాతకం’. రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా కూడా డిసెంబర్ 20న థియేటర్లలోకి రాబోతోంది. ఇదే రోజున ‘ఎర్ర చీర : ది బిగినింగ్’ అనే మూవీ కూడా రిలీజ్ అయి ప్రేక్షకులని అలరించబోతుంది.. ఇందులో రాజేంద్ర ప్రసాద్ మనవరాలు కీలకపాత్రను పోషించింది. ఇక డిసెంబర్ 21న మ్యాజిక్, డిసెంబర్ 25న రాబిన్ హుడ్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, బేబీ జాన్, డిసెంబర్ 27న పతంగ్ సినిమాలు తెరపైకి రానున్నాయి.