Sreeleela : స్టార్ హీరోయిన్ శ్రీలీల మంచి మ‌నస్సు.. 21 ఏళ్ల‌కే మాతృత్వం

Sreeleela : స్టార్ హీరోయిన్ శ్రీలీల మంచి మ‌నస్సు.. 21 ఏళ్ల‌కే మాతృత్వం

Sreeleela :  శ్రీలీల‌.. ఈ ముద్దుగుమ్మ తెలుగులో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. మొన్న‌టి వ‌రకు వ‌రుస సినిమాల‌లో న‌టించిన శ్రీలీల ఇప్పుడు స్లో అండ్ స్ట‌డీగా వెళుతుంది. ఇప్పుడు డ్యాన్సింగ్ స్టార్‌గా పేరు తెచ్చుకుంది శ్రీలీల‌. ‘పుష్ప 2’ కిస్సిక్ సాంగ్ తో శ్రీలీల ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. సౌత్ ఇండియాలో క్రేజియస్ట్ హీరోయిన్ గా ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం డాన్సింగ్ క్వీన్ అనే ఇమేజ్ తో దూసుకుపోతోంది. కమర్షియల్ హీరోయిన్ గా ఓ వైపు స్టార్ హీరోలతో జతకడుతూ మరో వైపు పాన్ ఇండియా స్టార్స్ తో కూడా ఆడిపాడే అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ‌.

అయితే శ్రీలీల అతి తక్కువ కాలంలోనే అభిమానులను సంపాదించుకుంది. 2019లో `కిస్` అనే కన్నడ చిత్రంతో నటిగా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తెలుగులో `పెళ్లి సందడి` (2021), జేమ్స్ (2022) లలో అతిథి పాత్రల్లో నటించింది. రవితేజ `ధమాకా` సినిమా శ్రీలీలను ప్రజల్లోకి తీసుకెళ్లింది. బాలకృష్ణ `భగవంత్ కేసరి`, మహేష్ బాబు `గుంటూరు కారం` సినిమాల్లోనూ నటించి మెప్పించింది. `గుంటూరు కారం`లో కుర్చీ మడతబెట్టి పాటకు శ్రీలీల వేసిన స్టెప్పులు సోష‌ల్ మీడియాని షేక్ చేశాయి.. ఆ పాట‌ని మ‌ళ్లీ మ‌ళ్లీ ప్లే చేస్తూ శ్రీలీల కోసమే చూశారంటే అతిశ‌యోక్తి కాదు.

గైనకాలజిస్ట్ స్వర్ణలత, వ్యాపారవేత్త సురబనేని సుధాకర్ రావు దంపతుల కుమార్తె శ్రీలీల. ఆమె పుట్టకముందే తల్లిదండ్రులు విడిపోయారు. తల్లితో పెరిగిన శ్రీలీల డాక్టర్ కావాలనుకుంది. కానీ, నటి కావాలనే కోరిక మొదలైంది. కుటుంబ సభ్యులు ముందు అభ్యంతరం చెప్పినా, తర్వాత ఒప్పుకున్నారు. ఓ వైపు డాక్టర్‌ (ఎంబీబీఎస్‌) చేస్తూనే సినిమాలు చేస్తూ రాణిస్తుంది. శ్రీలీల రెండేళ్ల క్రితం ఇద్దరు వికలాంగులైన పిల్లలను దత్తత తీసుకుంది. బై టు లవ్ అనే కన్నడ చిత్రంలో చిన్న వయసులోనే తల్లి పాత్ర పోషించింది.దీని తర్వాతే పిల్లలను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది. దత్తత ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పుడు శ్రీలీల వయసు 21. ఇప్పటికీ చాలా సేవా సంస్థలకు సహాయం చేస్తోంది. ఈ విష‌యాలు తెలుసుకున్న అభిమానులు శ్రీలీలపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.