Unstoppable 4 : నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ కార్యక్రమం సక్సెస్ ఫుల్‌గా సాగుతుంది. ప్రస్తుతం సీజన్ 4 నడుస్తుండగా,ఈ కార్యక్రమంలో పాపులర్ స్టార్స్ పాల్గొంటూ ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్నఈ షోలో తమ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి చాలా మందికి తెలియని పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇక అన్ స్టాపబుల్ నాలుగో సీజన్ ఇప్పటికే నాలుగు ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. మొదటి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రెండో ఎపిసోడ్‌కు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మూడో ఎపిసోడ్‌కు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, నాలుగో ఎపిసోడ్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథులుగా హాజరయ్యారు.
అన్ని ఎపిసోడ్స్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఐదో ఎపిసోడ్‌కి ఎవరు గెస్ట్‌గా వస్తారని అందరు ఎదురు చూస్తుండగా, ఆ నిరీక్షణకు తెరపడింది. డ్యాన్సింగ్ క్వీన్, కిస్సిక్ బ్యూటీ శ్రీలీల బాలయ్య టాక్ షో లో సందడి చేయనుంది. అలాగే జాతి రత్నం నవీన్ పొలిశెట్టి కూడా ఈ టాక్ షోకు హాజరవుతున్నారనే టాక్ వినిపిస్తుంది. తాజాగా శ్రీలీల పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో స్లీవ్ లెస్ టాప్, చీరకట్టులో క్యారవాన్ ముందు హొయలు పోతున్న స్టిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఐదో ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ కోసం శ్రీలీల ఆహా స్టూడియోకు వచ్చిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక శ్రీలీల విషయానికి వస్తే రుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీలపేరు మొన్నటి వరకు మార్మోగిపోయింది. వరుస సినిమాలతో శ్రీలీల తెగ రచ్చ చేసింది. యంగ్ హీరోలతో పాటు, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోతో సైతం యాక్ట్ చేసింది ఈ అమ్మడు. అయితే గత కొంతకాలంగా శ్రీలీల హవా తగ్గిందనే చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలలకు ఆఫర్లు తగ్గాయి .తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికి, తమిళ, హిందీ భాషల్లో అమ్మడుకు వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. రీసెంట్‌గా తమిళ స్టార్ అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయిందనే వార్తలొచ్చాయి. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం ‘దిలర్’ మూవీ చేస్తుండగా, ఇందులో కూడా శ్రీలీల కథానాయికగా ఎంపికైందనే టాక్ వినిపిస్తుంది.