OTT Movies : ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 23 సినిమాలు..ఏ సినిమాల‌పై ఎక్కువ ఫోక‌స్ చేయోచ్చు..!

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 23 సినిమాలు..ఏ సినిమాల‌పై ఎక్కువ ఫోక‌స్ చేయోచ్చు..!

OTT Movies :  ఈ మ‌ధ్య కాలంలో ఓటీటీలో సంద‌డి మాములుగా లేదు. ప్ర‌తి వారం కూడా సూప‌ర్ హిట్ మూవీస్ తో పాటు ప‌లు వెబ్ సిరీస్‌లు కూడా ఓటీటీలో సంద‌డి చేస్తున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్ లలోకి కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వచ్చేవారం ‘పుష్ప 2’ మూవీ థియేటర్లలోకి రానుండ‌డంతో తెలుగు చిత్రాలేవి పెద్దగా రిలీజ్ కావ‌డం లేదు. అయితే సిద్ధార్థ్ ‘మిస్ యూ’, శివరాజ్ కుమార్ ‘భైరతి రణగల్’ లాంటి డబ్బింగ్ సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి త‌మ అదృష్టం ప‌రీక్షించుకోబోతున్నాయి. అయితే ఓటీటీలో సాదాసీదా అంశాలతో రూపొందిన కంటెంట్ ను కాకుండా, కొత్త పాయింటును టచ్ చేసిన సినిమాలు చూసేందుకు ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూపిస్తున్నారు.

అలాంటి కంటెంట్ కలిగిన జాబితాలో ‘క’ సినిమా, ‘వికటకవి’ .. ‘ పారాచూట్’ సిరీస్ లు కనిపిస్తున్నాయి.ఓటీటీలోకి 23 సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానుండ‌గా, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ కూడా ఈ వీకెండ్‌లో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.హాట్‌స్టార్ లో చూస్తే.. సునామీ: రేస్ ఎగైనస్ట్ టైమ్ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 25, పారాచూట్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – నవంబర్ 29, సన్ నెక్స్ట్..కృష్ణం ప్రణయ సఖి (కన్నడ సినిమా) – నవంబర్ 29, నెట్‌ఫ్లిక్స్..కోల్డ్ కేసు: హూ కిల్డ్ జాన్ బెనెట్ రామ్సే (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 25, ఆంటోని జెసెల్‌నిక్ (ఇంగ్లీష్ సినిమా) – నవంబర్ 26, అవర్ లిటిల్ సీక్రెట్ (ఇంగ్లీష్ మూవీ) – నవంబర్ 27, చెఫ్స్ టేబుల్: వాల్యూమ్ 7 (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 27, ద మ‍్యాడ్‌నెస్ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 28, లవ్ నెవర్ లైస్: సౌతాఫ్రికా (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 29 చిత్రాలు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి.

ఇవే కాక పారిస్ క్రిస్మస్ వాల్ట్జ్ (ఇంగ్లీష్ మూవీ) – నవంబర్ 29, సెన్నా (పోర్చుగీస్ సిరీస్) – నవంబర్ 29,
సికందర్ కా మఖద్దర్ (హిందీ సినిమా) – నవంబర్ 29, ద స్నో సిస్టర్ (నార్వేజియన్ మూవీ) – నవంబర్ 29,
ద ట్రంక్ (కొరియన్ సిరీస్) – నవంబర్ 29, లక్కీ భాస్కర్ (తెలుగు సినిమా) – నవంబర్ 30 (రూమర్ డేట్), జీ5.. వికటకవి (తెలుగు సిరీస్) – నవంబర్ 28, డివోర్స్ కే లియే కుచ్ బీ కరేగా (హిందీ సిరీస్) – నవంబర్ 29, అమెజాన్ ప్రైమ్.. సేవింగ్ గ్రేస్ (తగలాగ్ సిరీస్) – నవంబర్ 28, హార్డ్ నార్త్ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 29, లయన్స్ గేట్ ప్లే.. బాయ్ కిల్స్ వరల్డ్ (ఇంగ్లీష్ సినిమా) – నవంబర్ 29, బుక్ మై షో.. జస్ట్ వన్ స్మాల్ ఫేవర్ (స్పానిష్ మూవీ) – నవంబర్ 29, ద వైల్డ్ రోబో (ఇంగ్లీష్ సినిమా) – నవంబర్ 29, వుయ్ లివ్ ఇన్ టైమ్ (ఇంగ్లీష్ మూవీ) – నవంబర్ 29న స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో ల‌క్కీ భాస్క‌ర్‌పై ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు.