Bigg Boss8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు వచ్చేసింది. మరి కొద్ది రోజులలోనే ఈ షోకి తెరపడనుంది. కంటెస్టెంట్స్ అందరు ఫినాలేకి చేరుకోవాలని కప్ అందుకోవాలని తెగ కృషి చేస్తున్నారు. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తుంది. ఓటింగ్‌లో చివరలో ఉన్న అవినాష్, టేస్టీ తేజతో పాటు, విష్ణుప్రియ పృథ్వీలలో ఇద్దరు హౌజ్ నుంచి బయట అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడైతే డబుల్ ఎలిమినేషన్ గురించి జోరుగా చర్చగా నడుస్తుండగా, ఆ ఇద్దరు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. లాస్ట్ వీక్‌లో పృథ్వీ టాస్కుల్లో బాగా ఆడుతున్న నేపథ్యంలో కొద్ది రోజుల పాటు ఆయన హౌజ్‌లో ఉంటాడని అంటున్నారు.
చూస్తుంటే ఈ వీక్ డేంజర్‌జోన్‌లో విష్ణుప్రియ, అవినాష్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు.ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో టికెట్ టూ ఫినాలే టాస్క్ నడుస్తుంది.ఈ టాస్కుల్లో భాగంగా బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్ అఖిల్, అలేఖ్య హారిక హౌజ్‌లోకి ప్రవేశించి సందడి చేశారు. అయితే వారు వచ్చి రావడంతోనే విష్ణుప్రియను టార్గెట్ చేశారు. ముఖ్యంగా అఖిల్. ఫోర్స్‌ఫుల్ రిలేషన్స్ కరెక్ట్ కాదని, వాటిని వదిలేసి ముందుకు వెళితేనే జర్నీ బాగుంటుందని విష్ణుప్రియ, పృథ్వీ లవ్ ట్రాక్‌పై పలు కామెంట్స్ చేశాడు. దీనికి విష్ణు ప్రియ ధీటుగానే సమాధానం ఇచ్చింది.
నేను నాలానే ఉంటూ వస్తోన్నానని అన్నది. ఓ వ్యక్తి అంటే ఇష్టం అంటే అది ప్రేమ కాదని చెప్పుకొచ్చింది. ఎవరు ఎన్ని చెప్పిన తను మాత్రం తనలానే ఉంటానని పేర్కొంది. ఇక ఎవరికోసమో మారితే తాను ఎలా అవుతానని వితండవాదం చేసింది. నా బిహేవియర్ నచ్చితే ఆడియెన్స్ నాకు ట్రోఫీ ఇస్తారు. వాళ్లకు నేను నచ్చలేదంటే ఇక్కడ ఉండను అంటూ అఖిల్‌తో వాదనకు దిగింది.ఇక కంటెండర్ టాస్క్ కోసం రోహిణి, గౌతమ్ లను సెలక్ట్ చేసుకున్నారు అఖిల్, హారిక. ఇక వారిద్దరు మరో ఇద్దరినిసెలక్ట్ చేసుకోవాలి. అయితే వారు తేజ, విష్ణు లను సెలక్ట్ చేసుకున్నారు. అయితే వారిలో గెలుపుతో పాటు.. సరిగ్గా ఆడకపోతే.. బ్లాక్ స్టార్ ఇస్తారు.రెండు టాస్క్ లలో రోహిణి విన్ అయ్యింది. విష్ణు పెద్దగా ఎఫర్ట్ పెటట్టకుండా కబుర్లు చెబుతుందని అనడంతో విష్ణు తొలిసారి కన్నీళ్లు పెట్టుకుంది. ఆమెని పృథ్వీతో పాటు పలువురు ఓదార్చారు.