Bigg Boss 8 : పోరా పోవే అనే షోతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన యాంకర్ విష్ణు ప్రియ. ఈ భామ బిగ్ బాస్ సీజన్ 8 లోకి అడుగుపెట్టి తన టాలెంట్‌తో అదరగొట్టింది. మొదట్లో ఆమె గ్రాఫ్ బాగానే ఉన్నా రాను రాను అది తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలో 14వ వారం ఎలిమినేట్ అయింది.14 వారం వీకెండ్ లో డబుల్ ఎలిమినేషన్ ద్వారా ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు బయటకు పంపించారు నాగార్జున. శనివారం ఎపిసోడ్ లో రోహిణి ఎలిమినేట్ అవ్వగా.. ఆదివారం ఎపిసోడ్ లో విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయింది. దాంతో టాప్ 5లో అవకాశం కోల్పోయింది విష్ణుప్రియ.
తాజా ఎపిసోడ్ ని నాగార్జున ఇంట్రెస్ట్‌గా మార్చారు. ఎప్పుడు నామినేషన్స్ లో ఉన్నవారిని సేవ్ చేస్తూ వచ్చిన నాగార్జున.. ఈసారి మాత్రం ఫైనలిస్ట్ ల ను రివిల్ చేస్తూ వచ్చారు.. ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాశ్ కాగా.. సెకండ్ ఫైనలిస్ట్ గా నిఖిల్, థర్డ్ ఫైనలిస్ట్ గా గౌతమ్, ఫోర్త్ ఫైనలిస్ట్ గా ప్రేరణ నిలిచారు. చివరిగా నబీల్,విష్ణు ప్రియ ఉండగా అందులో విష్ణు ప్రియని ఎలిమినేట్ చేసి నబీల్‌ని ఫైనల్‌కి పంపాడు. టైటిల్ ఫేవరెట్ కంటెస్టెంట్‌గా అడుగు పెట్టింది యాంకర్ విష్ణుప్రియ భీమనేని. కానీ, అతి తక్కువ కాలంలోనే తనలో విన్నర్ క్వాలిటీస్ లేవని, ఉన్నన్ని రోజులు ఎంటర్‌టైన్ చేయాలి, ఎంజాయ్ చేయాలి అన్నట్లుగా తన తీరు సాగింది. మొదటి రెండు వారాలు బాగానే గేమ్ ఆడిన విష్ణుప్రియ తర్వాత పృథ్వీరాజ్‌తో లవ్ ట్రాక్‌తో నెగెటివిటీని పెంచుకుంది.
కేవలం ఒక్క పృథ్వీపైనే ఫోకస్ పెట్టిన విష్ణుప్రియ తన బిగ్ బాస్ గేమ్‌ను తానే చేతులారా నాశనం చేసుకుంది. టైటిల్ కొడుతుందని ఆశించిన తన అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. అయితే విష్ణు ప్రియ ఫైనల్‌కి వెళ్లకపోయిన ఆమె విన్నర్ కన్నా ఎక్కువే రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్‌లో పాల్గొన్నందుకు ఒక్క వారానికి విష్ణుప్రియ రూ. 4 లక్షలు, రోజుకి రూ. 57,142 పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఇలా 14 వారాలకు విష్ణుప్రియ సుమారుగా రూ. 56 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, 99 రోజుల లెక్కన చూస్తే 56, 57,058 రూపాయలు అవుతున్నాయి. అంటే, బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువ అని చెప్పొచ్చు.