రోజూ ఉదయం నానబెట్టిన బాదంపప్పును తినాలి.. ఎందుకంటే..?
100 గ్రాముల బాదంపప్పు ద్వారా సుమారుగా 21.15 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఉదయం బాదంపప్పును తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో చిరుతిండి తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.
100 గ్రాముల బాదంపప్పును తినడం వల్ల సుమారుగా 49.42 గ్రాముల మేర ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. ఇవి మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు. ఇవి గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి.
బాదంపప్పులో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. 100 గ్రాముల బాదంపప్పు ద్వారా సుమారుగా 12.5 గ్రాముల మేర ఫైబర్ లభిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.
నానబెట్టిన బాదంపప్పును పొట్టు తీసి తింటే సులభంగా జీర్ణమవుతుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ సైతం కంట్రోల్ అవుతాయి. డయాబెటిస్ ఉన్నవారు ఇలా బాదంపప్పును నానబెట్టి ఉదయం తింటే రోజంతా షుగర్ లెవల్స్‌ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు.
100 గ్రాముల బాదంపప్పులో సుమారుగా 25.63 మిల్లీగ్రాముల మేర విటమిన్ ఇ లభిస్తుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. దీని వల్ల చర్మ కణాలు డ్యామేజ్ అవకుండా ఉంటాయి.
100 గ్రాముల బాదంపప్పు ద్వారా సుమారుగా 268 మిల్లీగ్రాముల మేర మెగ్నిషియం లభిస్తుంది. ఇది మెదడు, నాడుల పనితీరును మెరుగు పరుస్తుంది.
బాదంపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్లేవనాయడ్స్ జాబితాకు చెందుతాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. వాపులను తగ్గిస్తాయి.