Keerthy Suresh : మహానటి సినిమాతో దేశ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఈ భామ గత కొద్ది రోజులుగా తన ప్రేమ, పెళ్లి విషయాలతో వార్తలలో నిలుస్తుంది. సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ నుంచి మొదలు పెడితే మలయాళ చిత్ర సీమలో స్నేహితులతోనూ ఆమె ప్రేమాయణం నడిపిందని పుకార్లు పుట్టించారు. ఒకానొక సందర్భంలో తన స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పగా… కీర్తి సురేష్ ప్రేమలో ఉన్నారని ఓ న్యూస్ వైరల్ అయింది. అప్పుడు ఆ వార్తలను ఆవిడ ఖండించారు. ఇన్నాళ్లకు తన ప్రియుడి గురించి ఓపెన్ అప్ అయింది కీర్తి సురేష్.
సోషల్ మీడియాలో ప్రియుడితో కలిసి దిగిన ఫొటోని షేర్ చేస్తూ..15 ఏళ్ల తమ స్నేహ బంధం ఇకపై జీవితాంతం కొనసాగుతుంది’ అని తెలిపింది. ఇద్దరూ కలిసున్న ఫొటోని అయితే పోస్ట్ చేసింది గానీ ఆంటోని ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు కీర్తి. ఇక కీర్తికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ముందుస్తుగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మొదట ఈ పోస్ట్‌పై నటి రాశీఖన్నా స్పందిస్తూ.. ‘‘మేము ఇప్పుడే తెలుసుకున్నాం. కంగ్రాట్స్ లవ్’’ అని విష్ చేసింది. ఆ తర్వాత మాళవికా మోహనన్, అరుణ్ విజయ్, త్రిష, అపర్ణాబాల మురళి, సంయుక్తా మేనన్, నిక్కీ గల్రానీ, అనపమా పరమేశ్వరన్, శ్రీకాంత్ ఓదెల, పూజిత పొన్నాడ తదితర సినీ సెలబ్రిటీలు కీర్తికి కంగ్రాట్స్ తెలిపారు.
కీర్తి సురేశ్ చెప్పిన దానిబట్టి చూస్తే 15 ఏళ్ల ప్రేమ అంటే ఇంటర్మీడియట్లో ఒకరికి ఒకరు పరిచయమని తెలుస్తోంది. ఆ తర్వాత కీర్తి హీరోయిన్ గా కాగా.. ఆంటోని ఖతార్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత తిరిగి స్వదేశానికి వచ్చి కొచ్చిలో విండో సొల్యూషన్స్ కోసం యాస్పెరాస్ కంపెనీ పెట్టాడు. తర్వాత హోటల్స్ వ్యాపారంలోనూ అడుగుపెట్టాడు.కాగా డిసెంబర్ 11-12 తేదీల్లో గోవాలో కీర్తి-సురేష్ ల ఆంటోని తట్టిల్ ను డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని ప్రచారం నడుస్తుంది. ప్రస్తుతం కీర్తి సురేష్..ప్రస్తుతం ఆమె ‘రివాల్వర్ రీటా’, ‘బేబీ జాన్’ సినిమాల్లో వర్క్ చేస్తున్నారు. వరుణ్ ధావన్ లీడ్ రోల్లో భారీ అంచనాలతో ఈ చిత్రం ‘బేబీ జాన్’ తెరకెక్కనుండగా, కీర్తికి ఇది బాలీవుడ్లో తొలి సినిమా కావడం విశేషం.