Brahmamudi November 20th Episode : బ్రహ్మముడి తాజా ఎపిసోడ్‌లో రాజ్ స్టైలిష్‌గా కనిపిస్తాడు. గెలుపుఓటములు తప్పవు అని ప్రకాశం అనగా, నేనిప్పుడు ఓడిపోలేదు బాబాయ్. నాకు హ్యాపీ జర్నీ అని చెప్పాలి అని అంటాడు రాజ్. ప్రకృతి అన్నాకా పగలు చీకటి రెండు ఉంటాయి. ఇవాళ నేను వెలుగు నింపుకోడానికి వెళ్తున్నాను అని రాజ్ అంటే.. ఏదో వెలగబెట్టడానికి వెళ్తున్నాడట ఆశీర్వదించూ అని ఇందిరాదేవి అంటుంది. ఇందిరాదేవిని ఆశీర్వాదం అడిగితే సుపుత్ర ప్రాప్తిరస్తు అని అంటుంది. దాంతో నేను వెళ్లే పనేంటీ ఇస్తున్న దీవెనలు ఏంటీ అని రాజ్ అంటాడు. అన్నం తినేవాళ్లు ఎవరైన సరే భార్యాభర్తలు విడిపోవాలని కోరుకోరు అని రాజ్ అంటాడు. అప్పుడు మా అత్త అన్నం తినదా అని కౌంటర్ ఇస్తుంది. నన్ను లాగకు అని రుద్రాణి ఫైర్ అవుతుంది. తర్వాత సుభాష్ వచ్చి కూడా పిల్లపాపలతో కొడుకు ఉంటే పుత్రోత్సాహం కలుగుతుంది కదా అని అంటాడు.
నాకెందుకో కావ్యె గెలుస్తుందని అంటాడు సీతారామయ్య. దాంతో రాజ్ షాక్ అవుతాడు. రాజ్ ఫీల్ అవడం చూసి సరే ఆశీర్వదిస్తానని పుత్ర అభివృద్ధి ప్రాప్తిరస్తు అని దీవిస్తాడు. పందెం అంటే పందెమేరా నువ్ ఓడిపోతే కావ్యను సీఈఓగా ఒప్పుకోవడమే కాదు భార్యగా ఇంట్లోకి తీసుకురావాలి అని సీతారామయ్య అంటాడు. కచ్చితంగా గెలుపు నాదే అని రాజ్ అంటాడు. అందరు రాజ్ గెలవడం ఇష్టలేనట్లు మాట్లాడుతున్నారు. న్యాయంగా అయితే నా మనవడు అంత ఎత్తున ఉండాలని కోరుకుంటాను. కానీ ఈసారి కోరుకోను. వాడి కాపురం కూడా ఇంపార్టెంట్ కాబట్టి. అందుకే మా అందరి సంకల్పంతో కావ్య గెలవలాని కోరుకుంటున్నాం అని ఇందిరాదేవి చెప్పుకొస్తుంది.
మా టీమ్‌కు ఇంట్లోనే గ్రాండ్‌గా పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి వంటలు అద్భుతంగా చేయాలి. ఇదిగో మెను అని లిస్ట్ ఇస్తాడు రాజ్.మరోవైపు కావ్య ఆటో డ్రైవర్ మెల్లిగా తీసుకెళ్తాడు.దాంతో కావ్య స్పీడ్‌గా వెళ్లమని కోప్పడుతుంది. ఈమెను లేట్‌గా తీసుకెళ్లకుంటే రాజ్ సర్ నన్ను చంపెస్తారు అని ఆటో డ్రైవర్ అనుకుంటాడు. మరోవైపు పదిన్నరకు మీటింగ్ అనుకున్నాం కదా. కావ్య ఇంకా రాలేదేంటీ. ట్రాఫిక్‌లో ఇరుక్కుందేమో అని జగదీష్ అంటాడు. తన తరఫున నేను సారీ చెబుతున్నాను. ఆడవాళ్ల సంగతి తెలిసిందే కదా. లేట్‌గా లేస్తారు. ట్రాఫిక్‌లో ఇరుక్కుంటారు. కావ్య టాలెంటెడే కానీ, ఆలస్యానికి బ్రాండ్ అంబాసిడర్ అని రాజ్ అంటాడు.
కావ్యకు కాల్ చేస్తుంది శ్రుతి. త్వరగా రమ్మని, జగదీష్ గారి మైండ్ రాజ్ సర్ మార్చేలా ఉన్నారని శ్రుతి చెబుతుంది. తర్వాత మేడమ్ దారిలో ఉన్నారట వచ్చేస్తారు అని జగదీష్‌కు శ్రుతి చెబుతుంది. ఇంతలో ఆటో ఓ బైక్‌ను ఢీ కొడుతుంది. దాంతో బైకర్‌తో ఆటో డ్రైవర్ గొడవ పడతాడు. తను వచ్చేలోపు నా డిజైన్స్ చూస్తారా అని రాజ్ అంటే.. ఇద్దరివి ఒకేసారి చూస్తాను అని జగదీష్ అంటాడు. తను రాదు అని రాజ్ అంటే.. ఏంటీ అని జగదీష్ అంటాడు. మేడమ్ ఎప్పుడు లేట్‌గా రాలేదు. ఏదో జరిగింది అని శ్రుతి డౌట్ పడుతుంది. ఇప్పుడు టైమ్‌కు వెళ్లకపోతే నా లైఫే వేస్ట్ అవుతుంది అని కావ్య అంటుంది. ఇక లేట్ చేసి లాభం లేదని, రాజ్‌కు వస్తున్నట్లు మేసేజ్ చేస్తాడు ఆటో డ్రైవర్. కావ్య మేడమ్ వేసిన డిజైన్స్ కదా సర్ దగ్గరికి ఎలా వచ్చాయి అని శ్రుతి అనుకుంటుంది. కావ్యను తను వేసిన డిజైన్స్ చూపించమంటాడు జగదీష్. నా డిజైన్స్ ఇంకా పూర్తి కాలేదు. నా డిజైన్స్ దాదాపుగా దగ్గరిగానే ఉన్నాయి. కానీ, ఇవే చాలా బాగున్నాయి. మీరు ఇవే తీసుకోండి అని కావ్య అంటుంది.
మీ డిజైన్స్ సర్ ఇలా దొంగతనం చేసి బిల్డప్ ఇచ్చుకోవడం నేను చూడలేకపోతున్నాను అని శ్రుతి అంటుంది. చూడలేకపోతే జాబ్ మానేసి వెళ్లిపో. నా కష్టమైన, కష్టార్జితమైన నా భర్తకే చెందుతుంది. అది ఆయన హక్కు. నువ్ లేడి నారధుడిలా రెచ్చగొట్టకు అని కావ్య అంటుంది. నేనే గెలిచాను అని రాజ్ అంటాడు. ఛీ నీది ఒక గెలుపేనే కావ్య డిజైన్స్ దొంగతనం చేసి నీ డిజైన్స్ అని చెప్పుకోడానికి సిగ్గుగా లేదా, నా మనవడు అని చెప్పుకోడానికి సిగ్గు పడుతున్నాను అని సీతారామయ్య తిడతాడు. ఇప్పటికైనా కావ్యను ఇంటికి తీసుకురా పో అని ఇందిరాదేవి ఆర్డర్ వేస్తుంది.