Brahmamudi November 23th Episode : బ్రహ్మముడి సీరియల్ తాజా ఎపిసోడ్‌లో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. కావ్యను మోసం చేసి గెలిచి సీఈఓ పదవిని చేజిక్కించుకున్న రాజ్ బయటకి బాగానే ఉన్న అంతరాత్మ గొడవపడుతుంది. రాజ్ మాత్రం కవర్ చేసుకుంటూ ఉంటాడు. భార్య పోయిందన్న బాధ కొంచెం కూడా లేదారా నీకు.పెళ్లాన్ని మోసం చేసిన మొగుడు బాగుపడినట్లు చరిత్రలో లేదు. జీవితాంతం నువ్ సింగిల్‌గా ఇలాగే మిగిలిపోతావ్. ఇదే నా శాపం అని రాజ్ అంతరాత్మ మాయమైపోతాడు.ధాన్యలక్ష్మీ, రుద్రాణి, రాహుల్ మినహా ఇంట్లో ఎవ్వరూ భోజనం చేయరు. రాజ్ వచ్చి వడ్డించమని అంటే..ఇందిరాదేవి, అపర్ణ, సీతారామయ్య సెటైర్లు వేస్తారు. నువ్వు కావ్యను తీసుకురానందుకు కక్ష సాధింపు చర్య అని చురక వేస్తుంది రుద్రాణి. మర్యాదగా కావ్యను తీసుకొస్తావా లేదా అని అపర్ణ నిలదీస్తుంది.
ఓహో నాపై యుద్ధం ప్రకటిస్తున్నారా అని రాజ్ అంటే.. వాళ్లు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని రుద్రాణి చెప్పుకొస్తుంది. రేపటి నుంచి సహాయినిరాకరణ కూడా చేస్తారా అని రాజ్ అంటాడు. ఇదంతా నువ్ కావ్యను తీసుకురానందుకు కక్షసాధింపు చర్య నాన్న అని రుద్రాణి అంటుంది. ఒకరు తిని ఒకరు తినకపోతే ఎలా. నాకు ఆకలి వేస్తుంది. రండి తిందాం అని రాజ్ అంటాడు. కడుపు మాడ్చుకుంటే మూర్ఖులు మారుతారని రుద్రాణి లాంటి మూర్ఖులు కూడా అనుకోరు అని అపర్ణ పంచ్ వేస్తుంది.తెల్లారేసరికి అపర్ణ ఇంట్లో ఎక్కడా కనిపించదు. రాజ్ పై అలిగి ఎక్కడికైనా వెళ్లిపోయి ఉంటారని స్వప్న అంటుంది. కొడుకే తల్లిమాట లెక్కచేయకపోతే ఏ తల్లిమాత్రం ఇంట్లో ఉంటుందని ధాన్యలక్ష్మి అంటుంది. పోలీస్ కంప్లైంట్ ఇద్దామని ప్రకాశం అంటాడు..ఇంట్లో అందరూ కంగారు పడతారు
ధాన్యలక్ష్మీ ఎంత మొండిగా ఉన్న తన కొడుకు మాత్రం తన భార్యవైపే నిలబడ్డాడు. అలాగే, ధాన్యలక్ష్మీలోని మూర్ఖత్వం, మొండితనం నా కొడుకులో కనిపిస్తున్నాయి. కాబట్టి నేను నా కోడలివైపు నిలబడ్డాను అని అపర్ణ అంటుంది. కరివేపాకులు, కొత్తిమీర కట్టల గురించి మాట్లాడటం అనవసరం. కావ్యను తీసుకొస్తావా లేదా అని రాజ్‌ను నిలదీస్తుంది ఇందిరాదేవి. ఇంతకుముందే చెప్పాను. నేను తీసుకురాను. కానీ, మీరు తిన్నాకే తింటాను. అంతవరకు మీతోపాటు నేను కూడా నిరాహార దీక్ష చేస్తాను అని రాజ్ వెళ్లిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం అపర్ణను చూశావా అని సుభాష్ అందరిని అడుగుతాడు. ఇంట్లోనే లేదని ఇందిరాదేవితో అంటాడు సుభాష్. ఎందుకు టెన్షన్. ఏదైనా గుడికి వెళ్లుంటుంది, లేదా ఏదైనా పనిమీద వెళ్లి ఉంటుంది.
ఫోన్ చేస్తే తెలిసిపోతుంది అని రాజ్ అంటే.. ఆ విషయం మాకు తెలియదా. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వస్తుందని సుభాష్ అంటాడు. నాకు తెలిసి రాజ్ మీద అలిగి అపర్ణ ఆంటీ ఎటైనా వెళ్లిపోయి ఉంటారు అని స్వప్న అంటుంది. కొడుకే తల్లి మాటలు లెక్కచేయకుండా బాధపెడేలా మాట్లాడితే ఏ తల్లి మాత్రం ఇంట్లో ఉంటుందని ధాన్యలక్ష్మీ అంటుంది. ధాన్యలక్ష్మీ మాటలకు సుభాష్ కంగారుపడతాడు. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇద్దామని ప్రకాశం అంటాడు. అలా చేస్తే రాజ్‌కే ప్రాబ్లమ్. తనవల్లే వెళ్లిపోయంది కదా అని స్వప్న అంటుంది. ముందు కావ్యను ఇంట్లోంచి తరిమేశావ్. ఇప్పుడు తల్లిని ఆ తర్వాత అని ఇందిరాదేవి అంటే.. ఇక మిగిలింది మనమే కదా చిట్టీ. ఏదో ఒకరోజు మనల్ని కూడా తరిమేస్తాడు అని సీతారామయ్య అంటాడు. కంగారుపడుతుంటే అలా అంటారేంటీ అని రాజ్ అంటాడు. ఇంతలో శాంత కంగారుగా ఓ లెటర్ తీసుకొస్తుంది. స్వప్న కాల్ చేసి అడిగితే అపర్ణ వచ్చినట్లు చెబుతుంది కనకం. తర్వాత రాజ్ మాట్లాడుతాను అంటే అపర్ణ మాట్లాడదు. మాయ మాటలు నమ్మడానికి ఇక్కడ చిన్న పిల్లలు లేరు. నాకు మాట్లాడాలని లేదని చెప్పు కనకం అని అపర్ణ అంటుంది.