Brahmamudi Serial Today November 21st Episode : బ్రహ్మముడి సీరియల్ తాజా ఎపిసోడ్‌లో రాజ్ అన్ని కంతిరి వేషాలు వేయడం మనం చూసాం. అయితే జరిగిన విషయంలో కావ్య బాధపడుతుండగా, రాజ్ అక్కడికి వచ్చి అనుకున్నది అయినది ఒక్కటి అంటూ పాటలు పాడుతూ సినిమాల డైలాగులు కొడుతూ ఉంటాడు .. అయితే సినిమా డైలాగులు కొట్టగానే హీరోలు అయిపోరు రాజ్ గారు పనిలో నిజాయితీ ఉండాలి ధర్మం ఉండాలి అని అంటుంది కావ్య. హీరోలు కావాలంటే వారు చేసే పనిలో నిజాయితీ ఉండాలని .. వాళ్లు చేస్తున్న పని ధర్మంగా ఉండాలని రివర్స్ పంచ్ వేస్తుంది కావ్య. సీఈవో బాధ్యతల నుంచి గౌరవంగా తప్పుకుని వెళ్లిపో అంటూ రిజైన్ లెటర్‌ను తీసుకొచ్చి ఆమె చేత సంతకం చేయిస్తాడు. పందెంలో గెలిచినవాళ్లు సీఈవో అవుతారని.. ఓడిపోయినవాళ్లు ఏం చేయాలో గుర్తుందా అని అడుగుతాడు. ఈ కంపెనీ నుంచే కాదు నా లైఫ్ నుంచి కూడా నువ్వు శాశ్వతంగా వెళ్లిపోవాలని అంటాడు రాజ్.
అప్పుడు కావ్య సీఈవోగా రిజైన్ చేస్తుంది. బయటికి వెళ్లి ఎలా బతకాలి అనుకుంటున్నావా నీ స్థాయికి తగ్గట్టుగా ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాను అని దారుణంగా మాట్లాడుతాడు రాజ్.నా తల్లిదండ్రులు అలాంటి అలవాటు చేయలేదని చెప్పి బయల్దేరుతుంది. వెళ్లే ముందు నీకో చిన్న అప్రిషియేషన్ అని చెప్పి స్టాఫ్ అందరినీ పిలుస్తాడు. మీ మేడంకు ఆల్ ది బెస్ట్ చెప్పరా అంటూ స్టాఫ్‌తో అంటాడు. అయితే ఎవ్వరూ చెప్పకుండా మౌనంగా ఉండటంతో వాళ్లందరికీ టెర్మినేషన్ లెటర్ రెడీ చేయమనడంతో అంతా ఆల్ ది బెస్ట్ చెబుతారు. ఆమెకు పూల బొకే ఇచ్చి వెళ్లిపోమని అంటాడు రాజ్. కావ్య వెళ్లిపోగానే శృతికి క్లాస్ పీకుతాడు. సీఈవో ఛైర్‌లో కూర్చొని కావ్య నేమ్ ప్లేట్‌ని డస్ట్ బిన్‌లో పడేస్తాడు.
అనంతరం రైటర్ లక్ష్మీకాంత్ దగ్గరికి కళ్యాణ్ వెళ్లగా, అతని దగ్గరి నుంచి ఫైల్ తీసుకుని బలవంతంగా ఆశీర్వదిస్తాడు. ఇంతలో ఓ ప్రొడ్యూసర్ వచ్చి లక్ష్మీకాంత్‌ని కలుస్తాడు. కళ్యాణ్ రాసిచ్చిన పాటను అతనికి అమ్మేస్తాడు లక్ష్మీకాంత్. అనంతరం కళ్యాణ్‌ను టీ తీసుకురమ్మని ఆర్డర్ వేస్తాడు. అమ్మ పాట రాసింది నువ్వే కదా అని ప్రొడ్యూసర్ .. కళ్యాణ్‌ని గుర్తుపడతాడు. తాను లక్ష పారితోషికం తీసుకుని.. కళ్యాణ్‌కి పదివేలే ఇస్తాడు. నేను నిన్ను టీ తీసుకురమ్మన్నాని బాధపడుతున్నావా అని అడుగుతాడు లక్ష్మీకాంత్. నా పాట జనానికి నచ్చుతోందని , ఏదో ఒక రోజు గెలుస్తానని చెప్పుకొస్తాడు కళ్యాణ్. కావ్య బట్టలు సర్దేసి హడావుడి చేస్తుంది కనకం. ఇంతలో కళావతి బాధపడుతూ ఇంటికి వస్తుంది.
నేను అన్నీ సర్దేశానని.. నువ్వు రెడీ అయితే పంపిస్తానని చెబుతుంది కనకం. నువ్వు వచ్చేలోపు బ్యాగ్ బయటపెట్టనా అని అడగ్గా.. తీసుకెళ్లి నా గదిలో పెట్టమంటుంది కావ్య. రెస్ట్ తీసుకుని రేపు వెళ్తావా అని కనకం అడగ్గా.. ఇవాళే కాదు జీవితాంతం ఇక్కడే ఉండబోతున్నానని చెప్పుకొస్తుంది కావ్య. ఆ మాటలతో కనకం, కృష్ణమూర్తి షాక్ అవుతారు. ఇంటికి, ఆఫీస్‌కి, ఆయనికి శాశ్వతంగా దూరమైపోయానని చెబుతుంది కావ్య. వాళ్లు పెట్టిన పందెంలో నేను ఓడిపోయానని అంటుంది. మా బంధం తెగిపోయిందని.. ఇదంతా పీడ కల అనుకోమ్మని చెబుతుంది. కూతురి బాధను చూసి కృష్ణమూర్తి కనకం ఇద్దరు బాధపడుతూ ఉంటారు. మరొకవైపు ఆపర్ణ ఎలా అయినా కావ్య గెలుస్తుంది అన్న నమ్మకంతో హారతి తీయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇందిరాదేవి అక్కడికి వచ్చి నా మనవరాలు గెలిచిందా అనడంతో ఇంకా లేదు అత్తయ్య ముందుగా ఏర్పాటు చేసుకుంటున్నాను అని అంటుంది అపర్ణ. దాంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు.ఇంతలోనే రుద్రాణి రాహుల్ అక్కడికి వచ్చి ఏంటి వదినా నీ కొడుకు మీద ఆ మాత్రం నమ్మకం లేదా అని అంటుంది. ఎప్పుడు లేనిది రాహుల్ కూడా రాజ్ గెలవాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలోనే రాజ్ రావడంతో నా కోడలు వచ్చేసి నట్టు ఉంది అని అపర్ణ సంతోష పడుతూ ఉంటుంది. ఇంతలో సీతారామయ్య వచ్చి కావ్య చేసిన డిజైన్స్ దొంగలించి నువ్వు గెలిచావు నీది ఒక గెలుపేనా దుగ్గిరాల పరువు తీసావు అంటూ మండిపడతాడు