Karthika Deepam 2 Serial Today November 20th : కార్తీక దీపం తాజా ఎపిసోడ్‌లో ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. అప్పుడు మీ బావ దీప వల్లే ఇదంతా అని.. దీపను వదిలేసి నువ్వే (జ్యోత్స్న) కావాలని వస్తాడు. అప్పుడు ఆస్తి మనదే, మీ బావ మనవాడే అవుతాడు’ అంతే కదా? అంటూ ఆ ప్లాన్ చెప్పుకుని, చేతులు కలుపుకుని సంబరపడతారు జ్యో, పారులు. ఇక శౌర్య వచ్చి ఏమైంది నాన్న అమ్మ ఏడుస్తుంది అంటే అమ్మ వంట చేసింది కదా కంట్లో కారం పడిందని అంటాడు. ఇక కార్తీక్ ఐస్‌క్రీమ్ తినిపిస్తానని శౌర్యని తీసుకెళ్లిపోతాడు. జ్యోత్స్న ఓ చోట కారు ఆపి తాత నీతో మాట్లాడాలి అంటుంది. తాత నీకు ఇప్పటికీ ఆ దీప గురించి తెలీడం లేదు. పని దాని స్థాయి నుంచి యజమాని స్థాయికి మన ముందే ఎదిగింది అని అంటుంది జ్యోత్స్న. అందరూ జీవితంలో గెలవడానికి ఎదగడానికి తెలివి వాడుతారు.
దీప దాంతో పాటు తన మంచితనం అనే ముసుగు వాడింది. ఇక దాని అదృష్టం దాని కూతురు. మంచితనంతో అమ్మకి దగ్గరైతే దాని కూతురితో బావకి దగ్గరైంది. చివరకు ఇది ఎక్కడికి వచ్చి ఆగింది అంటే నువ్వు బావ మీద చేయి ఎత్తితే తన చేయి అడ్డు పెట్టేంత స్థాయికి ఎదిగింది. అంతే పొరపాటున నువ్వు బావని కొట్టుంటే దీప నిన్ను కొట్టేదా తాతయ్య. మన రెస్టారెంట్‌లో మన స్టాఫ్ ముందు మనకు ఇంత అవమానం జరిగితే మనం ఏం చేయలేమా. నాకు తెలిసి డాడీ నీకు ఎదురు తిరగరు. కనీసం ఎవరూ నిన్ను ఏం అనరు అని అంటుంది. అప్పుడు శివనారాయణ.. ఎవరి పొగరు ఎలా దించాలో నీ వయసుకి తెలియకపోయినా నా అనుభవానికి తెలుసు ఇంటి కెళ్దాం పద అని అంటాడు.
తాత ఏం చేయబోతున్నాడు. ఏం చేసినా బావకి దీపని దూరం చేయాలి అని జ్యోత్స్న అంటుంది. శివనారయణతో కారు దాకా వచ్చిన జ్యో.. ‘ఆ దీప మామూలు ఆడది కాదు తాతయ్యా.. దానికి నువ్వు అన్న లెక్కలేదు.. కూతుర్ని అడ్డం పెట్టుకుని బావను సొంతం చేసుకుంది.. దానికి ఎంత పొగరు లేకపోతే నిన్నే అవమానిస్తుంది?’ అంటూ బాగా రెచ్చగొడుతుంది జ్యో. దాంతో శివనారయణ.. ‘మనకు బాగా ఆవేశం వచ్చినప్పుడు ఆలోచనతో కొట్టాలి. కొడతాను.. ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు.. పదా వెళ్దాం’ అని కారు ఎక్కుతాడు శివనారాయణ. ‘అంటే తాత ఏం చేయబోతున్నాడు?’ అని జ్యో ఆలోచనలో పడుతుంది.
దీప, కార్తీక్, శౌర్యలు ఇంటికి వెళ్లాక మౌనంగా ఉండటంతో.. కాంచన, అనసూయలకు అనుమానం వస్తుంది. ‘రెస్టారెంట్‌లో ఏదో జరిగింది’అని ఫిక్స్ అయ్యి.. జాగ్రత్తగా శౌర్యకు చాక్లెట్స్ ఇచ్చి.. నిజానికి బయటకి లాగాలని చూస్తారు. అయితే దీప అప్పటికే శౌర్యకు ‘జరిగింది ఇంట్లో ఎవరికి చెప్పకు’ అని వార్నింగ్ ఇవ్వడంతో.. పూర్తిగా చెప్పదు. ‘జ్యో, ముద్దులు తాతయ్యా వచ్చారు’అని చాక్లెట్స్‌కి ఆశపడి.. చెబుతుంది కానీ.. దీప రావడం చూసి పారిపోతుంది. అయితే కాంచన.. దీపనే నిలదీస్తుంది. ‘నాన్న రెస్టారెంట్‌కి వచ్చాడా?’ అని. ‘ఓనర్స్ కదమ్మా రాకుండా ఎలా ఉంటారు’ అని మాట దాటేస్తుంది దీప. జరిగింది మాత్రం చెప్పదు. మరోవైపు శౌర్య బెలూన్‌తో ఆడుకుంటూ కళ్లు తిరిగి పడిపోతుంది. అక్కడే ఉన్న దీప పాపని చూసుకోదు. కార్తీక్ పిలుపుతో దీప పాపని చూసి కంగారు పడుతుంది.
కార్తీక్ వెనకే ఉన్న పాపని చూసుకోలేదని దీపని కార్తీక్ తిడతాడు. మందులు వేయలేదు అని దీప చెప్పడంతో జాగ్రత్తగా చూసుకోమని చెప్పినా పట్టించుకోవా అని తిడతాడు. ఇక శౌర్యని లేపి మందులు వేసి పడుకోపెడతాడు. నా కూతురికి ఏమైంది అని దీప అడుగుతుంది.మందులు వేసుకోకపోతే ఇలా అవ్వడం ఏంటి అని అడుగుతుంది. కార్తీక్ ఇలా ఎన్నాళ్లు శౌర్య కండీషన్ దాస్తాడో అని కాంచన అనుకుంటుంది. నాన్న ఉండగా నీకు ఏం కాదు హాయిగా పడుకో అని కార్తీక్ శౌర్యతో చెప్తాడు. దీప కార్తీక్‌తో నా కూతురికి ఏమైందని మళ్లీ అడుగుతుంది. నా దగ్గర ఏదో దాస్తున్నారని దీప అంటే నాకు ఏంటి అవసరం అని కార్తీక్ అంటాడు.