Karthika Deepam November 22nd Episode : కార్తీక దీపం 2 తాజా ఎపిసోడ్‌లో జ్యోత్స్న తన బావ అయిన కార్తీక్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు కాల్ చేస్తుంది. అప్పుడు కాంచన్ కాల్ లిఫ్ట్ చేస్తుంది. “మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దిడే బావా” అని జ్యోత్స్న అంటే.. థాంక్యూ చెబుతుంది కాంచన. అత్తా నువ్వా.. బావ ఫోన్ నువ్వెందుకు లిఫ్ట్ చేశావని జ్యోత్స్న అడగ్గా, అసలు నువ్వెందుకు కాల్ చేశావని కాంచన అడుగుతుంది. దీపతో గొడవ పడిన విషయంపై ఆరా తీస్తుంది. ఆ తర్వాత నా కొడుక్కి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పాలని కాంచన అంటుంది. ఆ తర్వాత బర్త్ డే విషెస్ చెప్పు అని అంటుంది. తాము గుడికి వెళ్లాలని అంటుంది. జ్యోత్స్న ఎంత అడిగినా కార్తీక్‍కు ఫోన్ ఇవ్వకుండానే కాల్ కట్ చేస్తుందని కాంచన. జ్యోత్స్న ఫోన్ నంబర్ డిలీట్ చేయాలని ఆలోచిస్తుంది. ఇక కార్తీక్ పుట్టిన రోజు సందర్భంగా దేవాలయంలో పూజలు చేస్తారు. ఈ సందర్భంగా కార్తీక్, దీప చూపులు కలుస్తాయి.
కార్తీక్, దీప ఇద్దరూ కలిసి తనను ఎత్తుకొని గంట కొట్టించాలని శౌర్య అడుగుతుంది. ఆ తర్వాత ఇద్దరూ శౌర్యను ఎత్తుకొని గంట కొట్టిస్తారు. దీంతో శౌర్య సంతోషిస్తుంది.ఆ తర్వాత గుడిలోని చెట్టుకు దారం చుడుతూ పూజ చేస్తుంది దీప. దీంతో ఈ పూజను శౌర్యకు తల్లిగా చేస్తున్నావా, నాకు భార్యగా చేస్తున్నావా.. శౌర్యకు అమ్మగా చేస్తున్నావా అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. శౌర్య సంతోషంగా ఉండడం ఈరోజు చూశానని, నీ ముఖంలోని అది చూడాలని అనుకుంటున్నానని దీపతో కార్తీక్ చెబుతాడు. నువ్వు నవ్వితే.. పని చేస్తూ పాటలు పాడితే చూడాలని ఉందంటూ దీపతో కార్తీక్ చెబుతాడు. ఇలా కష్టాలన్నీ తిరిపోతే సంతోషంగా ఉండాలని ఎదురుచూస్తున్నానని అంటాడు. ఇక గుడికి వెళ్లాలని జ్యోత్స్న కూడా రెడీ అవుతుంది. ఇంటికి వెళ్లొద్దని తాత చెప్పాడు కదే అని జ్యోత్స్నను వారిస్తుంది పారిజాతం.
అందుకే గుడికి వెళుతున్నానని జ్యోత్స్న అంటుంది. ఏ గొడవ చేయవద్దని పారిజాతం చెబుతుంది. గుడికి వెళ్లామని తెలిస్తే తాట తీస్తాడని అంటుంది. తాత ఒప్పోకోడని పారిజాతం అంటే.. అసలు అడగనని జ్యోత్స్న చెబుతుంది. తన పుట్టిన రోజుకు కార్తీక్ తీసుకొచ్చిన నెక్లెస్ వేసుకున్నానని జ్యోత్స్న అంటుంది. ఇది చూస్తే దీప గుండెకు గాయం అవుతుందని అంటుంది. దీపాలు వెలిగించేందుకు కార్తీక్, దీప, శౌర్య సిద్ధమవుతుంటారు. నీ పుట్టిన రోజు అందరం కలిసి అప్పట్లో దీపాలు వదిలేవారమని కార్తీక్‍తో చెబుతుంది కాంచన. అలా బాధపడకూడదనే నేను వచ్చాను అత్తా అంటూ జ్యోత్స్న ఎంట్రీ ఇస్తుంది.“నువ్వొస్తే ఉన్న బాధలు పోవడం కాదు. కొత్త బాధ మొదలవుతుంది” అని కార్తీక్ అంటాడు.
ఎందుకొచ్చావని నిలదీస్తుంది కాంచన. బావ పేరుతో కోనేట్లో దీపాలు వెలిగించేందుకు వచ్చానని జ్యోత్స్న అంటే.. ఆ మాట మీ తాతకు చెప్పావా అని కార్తీక్ అంటాడు. బావ ఎంత వెటకారంగా మాట్లాడుతున్నాడో చూశావా అత్తా.. ఇంట్లో చెబితే పంపిస్తారా అని జ్యోత్స్న అంటుంది. ఎవరికీ తెలియకుండా వచ్చానని చెబుతుంది. “బావంటే నాకు ఎంత ప్రేమో నీకు తెలుసు కదా. బావకు కూడా నేనంటే చాలా ఇష్టం. నా ప్రతీ పుట్టిన రోజుకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేవాడు. ఈ మెడలో ఉన్న నెక్లెస్ బావ గిఫ్టుగా ఇచ్చేందే” అని దీపను బాధపెట్టేందుకు జ్యోత్స్న మాట్లాడుతుంది. ఎదుటి వారు ఏడుపుతో కొట్టుకుకుపోతున్నా మనకు ఏం పట్టదు. రెచ్చగొట్టడం.. రచ్చ చేయడం. చదువుకోని పెద్దవాళ్లు అలానే ఉన్నారు. చదువుకున్న చిన్నవాళ్లు అలానే ఉన్నారు” అని కార్తీక్ అంటాడు.
దీంతో నన్ను, గ్రానీని కలిపి తిడుతున్నావని నాకు అర్థమైందని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ఎంతైనా తిట్టుకో.. నీతో కలిసిపోయేందుకే వచ్చానని, దీపను ఏడిపిస్తానని అనుకుంటుంది. ఓర్పు సహనంతో దేన్నయినా గెలవొచ్చని దీప అంటుంది. మనుషులను గెలవొచ్చు.. మూర్ఖులను కాదు అని కోపంగా అంటాడు కార్తీక్. బావ పుట్టిన రోజున ఆనందంగా వచ్చానని, ఎవరినీ బాధపెట్టాలని కూడా అని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్న కారణంగా నేను దీప పడుతున్న బాధలు చాలు అంటూ తనలో తాను మాట్లాడుకుంటాడు కార్తీక్. శివుడిని తలచుకొని దీపాలు వదలాలని కాంచన చెబుతుంది. కార్తీక్ దీపాలు ఎందుకు వలుతారో తెలియని వాళ్లు కూడా ఉన్నారని పంచ్ వేస్తాడు కార్తీక్.