Karthika Deepam Serial Today November 21st Episode : కార్తీక దీపం2 తాజా ఎపిసోడ్‌లో దీప నా కూతురికి ఏమయిందో చెప్పండి. అది ఎవరిని చూసి ఇలా భయపడుతోంది అసలు ఏమయ్యింది. నా మీద ఒట్టు వేసి చెప్పండి అంటూ దీప.. కార్తీక్ తో వేయించుకుంటుంది .నరసింహ రాలేడని చెప్పినా శౌర్యకు భయం పోలేదని కార్తీక్ అంటాడు. ఏదో దాస్తున్నారని దీప అంటుంది. “శౌర్యకు ఏ సమస్య లేదని నాపై ఒట్టేసి నిజం చెప్పండి” అని కార్తీక్‍తో ఒట్టే వేయించుకుంటుంది దీప. అయినా డాక్టర్ చెప్పిన విషయాన్ని దీపకు చెప్పకుండా దాచేస్తాడు కార్తీక్. నేనేం చేశాను బాబు ఆడడంతో ఎన్నిసార్లు చెప్పాను మన కూతురు గురించి మాత్రమే ఆలోచించు బయట వాళ్ల గురించి ఆలోచించకు అని సౌర్యని బాధ పెట్టడం మంచిది కాదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. తర్వాత శౌర్య వైపు చూస్తూ బాధపడుతూ కార్తీక్ అన్న మాటలు గుర్తుతెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది దీప.
తాను ఏం చేసినా శౌర్య గురించే అని దీప చెబుతుంది. తనకు అలా అనిపించడం లేదని, శౌర్యకు ట్యాబ్లెట్లు, సిరప్ ఇవ్వడం లేదని దీపపై కార్తీక్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మందులు మానేసిన విషయం తనకు చెప్పాల్సిందని అంటాడు. శౌర్య గురించే తాను బతుకుతున్నానని దీప అంటుంది. మరోసారి ఈ తప్పు చేయవద్దని, మన కూతురికి ఏమీ కాదని కార్తీక్ ధైర్యం చెబుతాడు. కార్తీక్ మాట నమ్ముతానని మనసులో దీప అనుకుంటుంది. శౌర్య అంటే దీపకు ప్రాణం కంటే ఎక్కువని, నిజం తెలిస్తే దీప తమకు దక్కదని అంటుంది. శౌర్యను జాగ్రత్తగా చూసుకుందామని, అయితే కార్తీక్, దీపను ముందుగా మనం కలపాలని కాంచన చెబుతుంది. పేరుకే వాళ్లిద్దరూ భార్యభర్తలని, కానీ అలా ఉండడం లేదని అంటుంది. ఏం చేయాలో చెప్పాలని అనసూయ అడుగుతుంది.
రేపు కార్తీక పౌర్ణమి అంటే కార్తీక్ పుట్టినరోజు అని కాంచన అంటుంది.అవునా ఇంత ఆలస్యంగా చెబుతున్నారు ఏంటమ్మా రేపు హంగామా చేయాలి అని అనసూయ అంటుండగా ఆ మాటలు విన్న దీప లోపలికి వస్తుంది. వారి మాటలు విని దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు రేపు బావ పుట్టిన రోజు నేను ఎలా అయినా బావని కలవాలి అనడంతో సుమిత్రని వెళ్లి అడగమని చెబుతుంది పారిజాతం.బావ కార్తీక్ వద్దకు వెళ్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతానని తన గ్రానీతో అంటుంది జ్యోత్స్న. ఇప్పటికే మీ తాత చాలా కోపంగా ఉన్నాడని, కార్తీక్‍కు దూరంగా ఉండాలని మీ అమ్మ చెప్పిందని జ్యోత్స్నతో ఆమె చెబుతుంది. తెలిస్తే మీ తాత ఊరుకోడని హెచ్చరిస్తుంది. తన బర్త్ డేకు వెళ్లకుండా తాను ఎలా ఉంటానని జ్యోత్స్న అంటుంది. పారిజాతంను అడగాలని జ్యోత్స్నకు గ్రానీ సలహా ఇస్తుంది. అయితే, గొడవను పెద్దది చేయొద్దని హెచ్చరిస్తుంది.
కార్తీక్ పుట్టిన రోజు సందర్భంగా రూమ్ డేకరేట్ చేసిన సర్‌ప్రైజ్ చేస్తుంది దీప. శౌర్య, కాంచన ముందుగా కార్తీక్‍కు హ్యాపీ బర్త్ డే చెబుతారు. హ్యాపీ బర్త్ డే నాన్న అంటూ కౌగిలించుకుంటుందని శౌర్య. కార్తీక్‍కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతుంది దీప. షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పాలని కార్తీక్. దీప చేతులు కలుపుతుందని శౌర్య “పుట్టిన రోజు శుభాకాంక్షలు కార్తీక్ బాబు” అంటూ మరోసారి చెబుతుంది దీప. బావకు విషెస్ చెప్పేందుకు ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తున్నానని పారిజాతంతో చెబుతుంది జ్యోత్స్న. మహా అయితే నాలుగు తిట్లు తిడతాడని, కార్తీక్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పాలని పారిజాతం చెబుతుంది. “వ్రతం రోజున నేను మెట్టుదిగొచ్చినా మీరు ఒప్పుకోలేదని అన్నాను. ఈ విషయం తెలియదని మీ అత్త అంది. పెళ్లికి ఒప్పుకున్నానని ముందే తెలిసినా తాను దీప మెడలోనే తాళి కడతానని మీ బావే అన్నాడు. దాని అర్థమేంటి. నా మాటంటే లెక్కలేదని, నువ్వుంటే ఇష్టంలేదని” అని జ్యోత్స్నతో శివన్నారాయణ కోపంగా చెపుతాడు. వారి దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని వెళతావని అంటాడు.