Keerthy Suresh : నేను శైలజ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఈ భామ మహానటి సినిమాతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. టాలీవుడ్‌లో బడా స్టార్స్ అందరితో కలిసి నటించింది. లేడి ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేసింది. ఇప్పటికీ వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ త్వరలో వివాహం చేసుకోనుందంటూ కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. ఆరంభంలో దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్తని కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంటుందనే వార్తలు రాగా, ఆ తరువాత కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ అని, తమిళ నటుడు విజయ్‌ని వివాహం చేసుకోనుందని అనేక ప్రచారాలు సాగాయి.
అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ రీసెంట్‌గా కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వచ్చింది. . తన స్నేహితుడైన వ్యాపారవేత్తని కీర్తి సురేష్ పెళ్లాడబోతోందని టాక్ నడుస్తోంది. అలాగే అతని పేరు ఆంటోనీ తటిల్ అనే మాట ప్రచారంలో ఉంది. కీర్తి సురేష్ పెళ్లిచేసుకోబోయే వ్యక్తి ఇతనే అంటూ ఆంటోనీ తటిల్ ఫోటో కూడా వైరల్ అవుతుంది. కీర్తి సురేష్ పెళ్లి అని న్యూస్ వచ్చిందో లేదో ఇంతలోనే ఆమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి డీటెయిల్స్ తో పాటూ అన్ని ఆరాలు తీస్తున్నారు నెటిజన్స్. కీర్తి సురేశ్ చాన్నాళ్లుగా ఆంటోని తట్టిల్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. కానీ ఎక్కడా ఆ విషయం బయటపడకుండా జాగ్రత్త పడింది. ఆంటోనీ దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త అని తెలిసింది. “కేరళకు చెందిన అంటోనీ తట్టిల్ ప్రస్తుతం కొచ్చి, దుబాయ్‌లలో ప్రముఖ వ్యాపారవేత్త. కైపలాత్ హబీబ్ ఫరూక్‌తో కలిసి చెన్నైలో నమోదైన ఆస్పెరోస్ విండో సొల్యూషన్స్‌కు ప్రధాన యజమాని.
కేరళ, దుబాయ్‌లలో ఆయనకు కోట్లలో ఆస్తులున్నాయని చెబుతున్నారు. ఆంటోని చాలా ప్రశాంతంగా ఉండే వ్యక్తి అట. కీర్తి సురేష్ అంటే చాలా ఇష్టం అతనికి. అందుకే ఆమె ఏది కోరుకున్న తను అడ్డు చెప్పడట. డిసెంబరు 11-12 తేదీల్లో గోవాలో కీర్తి-ఆంటోని డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వారి వివాహం జరగనున్నట్టు సమాచారం. అయితే ఆంటోని క్రిస్టియన్ కాగా, అతని కోసం కీర్తి సురేష్ కూడా మతం మార్చుకుంటుందా అనేది పెద్ద ప్రశ్నగా మారింది.