Samantha: ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల ముద్దుగుమ్మ సమంత. చూడ చక్కని అందం,ఆకట్టుకునే అభినయంతో ఎంతగానో అలరించిది. సమంత అదృష్టం కొద్ది అక్కినేని ఇంటి కోడలిగా కూడా వెళ్లింది. అంత సవ్యంగా సాగుతున్న సమయంలో ఆమె జీవితంలో ఒక్కసారిగా ఒడిదుడుకులు వచ్చాయి. నాగ చైతన్యతో విడాకులు, మయోసైటిస్, సినిమాలకి బ్రేక్ ఇలా ఆమెని చాలా కుంగదీసాయి. అయిన ధైర్యంగా వాటన్నింటిని ఎదుర్కొని తిరిగి సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తుంది.మరోవైపు సందర్భం వచ్చినప్పుడు తన విడాకుల గురించి కూడా మాట్లాడుతూ హాట్ టాపిక్ అవుతుంటుంది.
తాజా ఇంటర్వ్యూలో విడాకులు తీసుకున్న సమయంలో ఎదుర్కొన్న ట్రోలింగ్ గురించి సమంత మాట్లాడింది. సమాజంలో మహిళ ఎదుర్కొనే సవాళ్ల గురించి చెప్పుకొస్తూ… ఓ ఇద్దరి మధ్య బందం తెగిపోతే తప్పు ఎటువైపు ఉన్నా అమ్మాయినే నిందిస్తారెందుకు అని సమంత ప్రశ్నించింది. దురదృష్టవశాత్తూ మనం అలాంటి సమాజంలో బతుకుతున్నామని అసహనం వ్యక్తం చేశారు సామ్. నాపై కూడా ఎన్నో అవాస్తవాలు ప్రచారం చేశారు. అవన్నీ తట్టుకుని ఇలా ఉన్నాను అని ఆవేదన వ్యక్తం చేశారు. విడాకులు తీసుకున్న తర్వాత అమ్మాయిలకు ఈ సమాజం ‘సెకండ్ హ్యాండ్, ఆమె జీవితం వృథా, యూజ్డ్’ ఇలాంటి ట్యాగ్స్ ఎందుకు తగిలిస్తారో ఇప్పటికీ నాకు అర్ధం కావడం లేదు.
కష్టాల్లో ఉన్న సదరు మహిళను, అమ్మాయిని ఇవి మరింత ఎక్కువగా నిరాశ పరుస్తాయి. నా గురించి కూడా ఎన్నో అవాస్తవాలను ప్రచారం చేశారు. అవి అబద్ధాలు, అందుకే వాటి గురించి మాట్లాడాలని ఎప్పుడూ అనుకోలేదు. కష్ట సమయంలో నా స్నేహితులు, కుటుంబ సభ్యులు చాలా మంది నాకు మద్దతుగా నిలిచారు అని సామ్ పేర్కొంది. తన పెళ్లి గౌనును రీ మోడల్ చేయించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కూడా విమర్శలు వచ్చాయి. సమంత కావాలనే అలా చేసిందని, ప్రతీకారం తీర్చుకుంటుంది అని చాలా మంది విమర్శించారు. దాని గురించి సామ్ మాట్లాడుతూ “నా పెళ్లి గౌను రీ మోడల్ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా బాధపడ్డా. ఆ గౌను రీ డిజైన్ చేసి, నేను ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోలేదు. నా లైఫ్లో జరిగిన సంఘటనలను నేనెప్పుడూ దాచాలనుకోలేదు. ఎన్నో కష్టమైన దశలు దాటుకొని వచ్చాను. నా జీవితం అక్కడితో ముగిసిపోయిందని మాత్రం కాదు. ఎక్కడైతే ముగుస్తుందో అక్కడే తిరిగి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం నేను చాలా హ్యాపీగా ఉన్నాను” అని చెప్పారు.